చెన్నయ్ సుందరి త్రిషలో పెళ్లికళ వచ్చేసిందని కోలీవుడ్ లో ప్రచారం ఊపందుకుంది. వచ్చే మార్చి నెలలో పెళ్లి పీటలు ఎక్కనుందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగా ప్రస్తుతం చేస్తున్న సినిమాలను త్వరగా పూర్తి చేసే పనిలో ఆమె వుంది. అలాగే, కొత్త సినిమాలు ఏవీ ఈ సుందరి అంగీకరించడం లేదు. మరోపక్క ఆమె తల్లి పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా చెబుతున్నారు.
అయితే, పెళ్లి చేసుకున్న తర్వాత ఇక నటించననీ, కానీ సినిమా రంగాన్ని మాత్రం వదలననీ ఇటీవల ఈ చిన్నది ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. అంటే, పెళ్లయ్యాక ఆమె దర్శకత్వం వైపు దృష్టి సారించవచ్చని అంటున్నారు. నిర్మాత, పారిశ్రామిక వేత్త వరుణ్ మణియన్ తో ఇటీవలే ఆమెకి వివాహ నిశ్చితార్థం జరిగినట్టూ, ఆ తర్వాత ఆయన సమకూర్చిన ప్రత్యేక విమానంలో ఈ సుందరి ఢిల్లీ, ఆగ్రా తదితర ప్రదేశాలు చుట్టి వచ్చినట్టూ వార్తలొచ్చిన సంగతి విదితమే!