Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

05-Sep-2017 12:38:01
facebook Twitter Googleplus
Photo

ప్రస్తుతం వస్తున్న కథలను చూస్తుంటే భారీ మార్పులే చోటు చేసుకుంటున్నాయనే చెప్పాలి. యువ హీరోలు ఎక్కువగా కొత్త తరహా కథలను తెరకెక్కిస్తు వారి స్థాయిని మించి ఊహించని హిట్ ను అందుకుంటున్నారు. ఇటీవల విజయ్ దేవరకొండ - అర్జున్ రెడ్డి సినిమానే అందుకు ఉదాహరణగా చెప్పుకోవాలి. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఊహించిన దానికంటే ఎక్కువ స్థాయిలోనే వసూళ్ళను రాబట్టింది.

ఇక ఎన్ని వివాదాలు వచ్చిపడినా సినిమా కంటెంట్ కి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. దీంతో ఇతర భాషల్లో కూడా అర్జున్ రెడ్డి కథ తెరకెక్కబోతుందని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే తమిళ్ లో యాక్టర్ ధనుష్ ఈ సినిమా కథను నచ్చి కొనేసుకున్నాడాని వార్తలు వచ్చాయి. అయితే బాలీవుడ్ కూడా అర్జున్ రెడ్డి సినిమాపై కన్నేసిందనే వార్త జోరందుకుంది. అర్జున్ రెడ్డిగా బాజిరావ్ మస్థాని ఫెమ్ రణ్ వీర్ సింగ్ నటించబోతున్నాడని టాక్. ఇప్పుడు పాయింట్ ఏంటంటే.. అసలు బాలీవుడ్ లో ఈ కథను తీస్తే చూస్తారా?

ఇలాంటి కథలు బాలీవుడ్ కి కొత్తేమి కాదు. దాదాపు అర్జున్ రెడ్డి తరహాలో ఉండే రాక్ స్టార్ మరియు తమాషా సినిమాలు బాలీవుడ్ లో నిరాశపరిచాయి. అర్జున్ రెడ్డి ఇక్కడి లోకల్ లాంగ్వేజ్ లో కూడిన బూతులతో ఉండే ఒక సింపుల్ లవ్ స్టోరీని చూపించాడు. బాలీవుడ్ లో కూడా చాలా సినిమాల్లో లవ్ స్టోరీస్ లలో అక్కడి వారికి దగ్గరగా వుండే లాంగ్వేజ్ ని ఉపయోగించుకుని తెరక్కేకించారు. మరి పూర్తిగా విజయ దేవరకొండ స్టైల్ లోనే తెరకెక్కిస్తారా లేదా వారి స్టైల్ లో చూపిస్తారా అనేది తెలియాలంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

,  ,  ,  ,