Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Feb-2016 15:03:42
facebook Twitter Googleplus
Photo

వరుస సక్సెస్ లతో దూసుకెళ్తున్న మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా, సక్సెస్ ఫుల్ నిర్మాత అల్లు అరవింద్ నిర్మాతగా, ప్రతిష్టాత్మక చిత్రాల్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన గీతా ఆర్ట్స్ బ్యానర్లో, , స్టైలిష్ డైరెక్టర్ గా పలు బ్లాక్ బస్టర్ మూవీస్ అందించిన సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ చిత్రానికి శ్రీకారం చుట్టారు. రాంచరణ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ పదో చిత్ర ప్రారంభోత్సవం గీతా ఆర్ట్స్ ఆఫీస్ ప్రాంగణంలో ఈరోజు లాంఛనంగా జరిగింది. తమిళంలో వంద కోట్ల మైలురాయిని దాటిన తని ఒరువన్ చిత్రానికి రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. అల్లు అరవింద్, రాంచచరణ్ కాంబినేషన్లో గతంలో వచ్చిన మగధీర చిత్రం ఇండస్ట్రీ రికార్డులు నెలకొల్పిన సంగతి తెలిసిందే. దీంతో భారీ అంచనాల నడుమ నిర్మించబోతున్న ఈ సినిమాను ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా రూపొందించబోతున్నారు. ఈరోజు లాంఛనంగా పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈనెల 22నుంచి జరగనుంది.

నటీనటులు
రాంచరణ్, రకుల్ ప్రీత్ సింగ్, అరవింద్ స్వామి, నాజర్, పోసాని కృష్ణ మురళి తదితరులు

సాంకేతిక నిపుణులు

సినిమాటోగ్రాఫర్ - అసీమ్ మిశ్రా
మ్యూజిక్ - హిప్ హాప్ ఆది
ప్రొడక్షన్ డిజైనర్ - రాజీవన్
ఆర్ట్ - నాగేంద్ర
ఎడిటర్ - నవీన్ నూలి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - వి.వై. ప్రవీణ్ కుమార్
కో ప్రొడ్యూసర్ - ఎన్.వి.ప్రసాద్
ప్రొడ్యూసర్ - అల్లు అరవింద్
దర్శకుడు - సురేందర్ రెడ్డి

,  ,  ,  ,  ,  ,