Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Nov-2016 11:39:26
facebook Twitter Googleplus
Photo

మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్.. తొలిసారి ప్రొడక్షన్ రంగంలోకి అడుగుపెడుతూ.. ''కొణిదెల ప్రొడక్షన్స్'' అనే బ్యానర్ ను స్థాపించాడు. తన తల్లి పేరు మీద తొలి సినిమా ''ఖైదీ నెం 150'' రూపొందిస్తున్నాడు. డాడే హీరో. అక్కే ఫ్యాషన్ డిజైనర్. అయితే ఈ కంపెనీని మెగాపవర్ స్టార్ రన్ చేసే తీరు చాలా కొత్తగా ఉందని.. ఇప్పటివరకు ఎన్నడూ లేని విధంగా సోషల్ బజ్ క్రియేట్ చేస్తున్నారని అంటున్నారు విశ్లేషకులు. ఏంటా సంగతి.. పదండి చూద్దాం.

నిజానికి చాలామంది టాలీవుడ్ పెద్ద ప్రొడ్యూసర్లందరూ.. ఒక సినిమాను ఒక పర్టిక్యులర్ పి.ఆర్.ఓ చేతిలో పెట్టేస్తారు. అయితే చరణ్ మాత్రం కొణిదెల ప్రొడక్షన్స్ కోసం.. ఆల్రెడీ ఫిలిం జర్నలిజంలో అనుభవం ఉన్న కొంతమందిని ఈ మీడియా మేనేజ్మెంట్ టీమ్ క్రింద పెట్టుకున్నాడట. అంతే కాదు.. వీరిలో కొందరు సోషల్ మీడియా ప్రమోషన్ ఎక్సపర్టులు కూడా ఉన్నారట. వీరందరూ ఇప్పుడు నిరంతరం రామ్ చరణ్ సైడ్ నుండి ఖైదీ నెం 150 సినిమాను హ్యాండిల్ చేస్తున్నారట. వీరందరూ కూడా ముంబయ్ అండ్ బెంగుళూరులో సోషల్ మీడియాలో పనిచేసిన నిష్ణాతులు కావడంతో.. సినిమాను ప్రమోట్ చేయడం వీరికి చాలా ఈజీ అయిపోయింది.

ఒకప్పుడంటే పి.ఆర్.ఓ.లు ప్రెస్ నోట్ పంపితేనో.. లేకపోతే ఎసెమ్మెస్ చేస్తేనో న్యూస్ బయటకు వచ్చేది. కాని ఇప్పుడు పద్దతులు మారాయ్. ట్వీటేస్తే చాలా.. మీడియానే తీసేసుకుంటోంది. అందుకే కొణిదెల ప్రొడక్షన్స్ సోషల్ మీడియాపై ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లుంది. మరి ''ఖైదీ నెం 150''కు ఎంతటి హైప్ తెచ్చారో ఆ రేంజ్ సక్సెస్ కూడా సాధిస్తే.. ఇక రచ్చ రచ్చే.

,  ,  ,  ,  ,