Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Nov-2016 12:36:48
facebook Twitter Googleplus
Photo

మెగా హీరో రామ్ చరణ్.. ఆయన భార్య ఉపాసనలు.. వేరు కాపురం పెట్టేయడానికి రెడీ అయిపోయిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవితో పాటు ఆయన ఇంట్లో కాకుండా.. సొంతిల్లు కట్టుకుని అందులోకి మారేందుకు రెడీ అవుతున్నారు కాబట్టి.. టెక్నికల్ గా ఇలాగే చెప్పాలి. అఫ్ కోర్స్ వేరు కాపురం అన్న మాటకు రాంగ్ సెన్స్ వస్తుంది కానీ.. మెగా ఫ్యామిలీలో అలాంటి వేరియేషన్స్ ఉండవ్.

చరణ్-ఉపాసనలు తమ కలల సొంతింటిని దగ్గరుండి కట్టించుకుంటున్నారు. ఇంటర్నేషనల్ స్టైల్ డిజైనింగ్.. ఇంటీరియర్ డిజైన్స్.. పెయింటింగ్స్.. లాన్ ఏర్పాట్లు.. ఇలా అన్ని అంశాలపై కలిపి ఏకంగా 80 కోట్లు ఖర్చు పెడుతున్నారట ఈ మెగా జంట. ఆరోగ్యంపై పూర్తి స్థాయిలో అవగాహన కం పట్టుదల ఉన్న వీరిద్దరు.. తమ ఇంటిలోనే జిమ్.. స్విమ్మింగ్ పూల్.. టెన్నిస్ కోర్ట్ లను కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. చెర్రీ అండ్ ఉపాసనల రేంజ్ కి 80కోట్లతో ఇల్లు కట్టుకోవడం పెద్ద విషయమేమీ కాదనే చెప్పాలి. అయితే.. వీళ్లు తమ సొంతింటిలోకి మారిన తర్వాత.. పిల్లల కోసం ప్లానింగ్ కూడా చేసుకోవాలని అనుకుంటున్నట్లు సన్నిహితులు చెప్పేసుకుంటున్నారు.

ఇక ప్రస్తుతం బి-పాజిటివ్ మ్యాగజైన్ మరియు అపోలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీకి సంబంధించిన పనుల్లో ఉపాసన బిజీగా ఉంటే.. మరో ప్రక్కన మెగాపవర్ స్టార్ 'ధృవ' రిలీజ్ కోసం కసరత్తుల్లో భాగంగా టైటిల్ సాంగ్ షూటింగులో బిజీగా ఉన్నాడు.

,  ,  ,  ,  ,  ,