Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Jan-2017 14:51:57
facebook Twitter Googleplus
Photo

మెగాస్టార్ చిరంజీవి కంబ్యాక్ మూవీ ఖైదీ నెం 150. మూవీ గ్రాండ్ సక్సెస్ అవ్వడంతో ఇక అభిమానులు ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. 100 కోట్లు గ్రాస్ దాటుకుని ఈ సినిమా ముందుకు దూసుకుపోవతుండటంతో.. అభిమానులు కూడా తమ అభిమానాన్ని కొత్తరకంగా చూపిస్తున్నారు.

అదిగో ఒక అభిమాని ఏకంగా ఐస్ గెడ్డల్లో ఖైదీ నెం 150 అనే అక్షరాలను చెక్కేశాడు. అంతేకాదు.. చెక్కేసిన ఆ శిల్పాన్ని మనోడు డైరెక్టుగా ఖైదీ ప్రొడ్యూసర్ రామ్ చరణ్ దగ్గరకు తీసుకెళ్లాడు. వెంటనే అది చూసి చలించిపోయిన చెర్రీ.. ఆ అమేజింగ్ శిల్పాన్ని ఫేస్ బుక్ లో షేర్ చేసి.. ఇతర అభిమానులకు కూడా ఆనందాన్ని పంచేశాడు. ఇప్పటికే చాలామంది ఒంటి మీద టాటూలు వేయించుకోవడం.. టీ షర్టుల మీద ఖైదీ లోగో ప్రింటింగ్ చేయించుకోవడం.. వంటి ఫీట్లు చేస్తుంటే.. ఈ ఐస్ స్కల్ప్చర్ ఏదో కొత్తగా ఉంది కదూ.

ఇకపోతే ఖైదీ నెం 150 సినిమా తాలూకు ఫస్ట్ వీక్ కలక్షన్లు.. రెస్సాన్స్.. బ్రేక్ డౌన్ ఎలా ఉందో చెప్పడానికి ఈరోజు సాయంత్రం మీడియాతో ఇంటారక్డ్ అవుతున్నాడు రామ్ చరణ్.

,  ,  ,  ,  ,  ,