Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Jul-2015 16:00:06
facebook Twitter Googleplus
Photo

యూత్ లో ఎక్కువ ఫాలోయింగ్ వున్న కథానాయికలకు తమ సరసన అవకాశం కల్పించడానికి కథానాయకులు మొగ్గు చూపుతుంటారు. అలాగే కథాపరంగా తమతో తలపడే ప్రతినాయకుడు కూడా కొత్తవాడైతే బాగుంటుందని భావించి అతని ఎన్నికలోనూ ఆసక్తి చూపుతుంటారు. అలా శ్రీనువైట్ల దర్శకత్వంలో చరణ్ చేస్తోన్న సినిమా ద్వారా 'అరుణ్ విజయ్' అనే కొత్త విలన్ పరిచయం కానున్నాడు. తమిళ చిత్రాలలో ప్రముఖ నటుడిగా పేరు తెచ్చుకున్న విజయ్ కుమార్ కొడుకే ఈ అరుణ్ విజయ్.


ఇటీవల అజిత్ హీరోగా వచ్చిన 'ఎన్నై అరిందాల్' చిత్రంలో ప్రతినాయకుడిగా అరుణ్ విజయ్ మంచి మార్కులు కొట్టేశాడు. ఆ సినిమాలో ఆయన ఫెర్ఫార్మెన్స్ చరణ్ కి నచ్చడంతో, ఈ సినిమాలో విలన్ గా ఆయనకి అవకాశం దక్కింది. ఈ ఇద్దరికి సంబంధించిన కొన్ని యాక్షన్ సన్నివేశాలను శ్రీనువైట్ల చిత్రీకరిస్తున్నాడు. ఈ యాక్షన్ ఎపిసోడ్స్ ఆడియన్స్ ని కట్టిపడేస్తాయనే టాక్ వినిపిస్తోంది. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా కనువిందు చేయనున్న ఈ సినిమాను, దసరా పండుగ కానుకగా ప్రేక్షకులకి అందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

,  ,  ,