Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-Sep-2016 11:50:04
facebook Twitter Googleplus
Photo

తెలుగు ప్రేక్షకులపై ఈ మధ్య బ్యూటీ రెజీనా అలిగింది. టాలీవుడ్ ప్రేక్షకులు త్వరగా మర్చిపోతారని పైకి అంటున్నా.. వారంవారం కొత్త హీరోయిన్స్ వస్తుంటే.. అప్పటికే ఉన్న వాళ్లని మూవీ మేకర్స్ పట్టించుకోవడం లేదన్నది.. ఆమె ఉద్దేశ్యం కావచ్చు. అయితే.. ప్రస్తుతం ఈ బ్యూటీ ఓ తమిళ్-తెలుగు బై లింగ్యువల్ చిత్రంలో నటిస్తోంది. రెజీనా చేతిలో 4-5 కోలీవుడ్ సినిమాలు ఉన్నాయి కానీ.. 1945 పీరియాడికల్ చిత్రం కావడంతో.. ఎక్కువగా వార్తల్లో వినిపిస్తోంది.

1945 చిత్రంలో రెజీనా లీడ్ రోల్ లో నటిస్తుండగా.. బాహుబలిని పొడిచేసిన కట్టప్ప పాత్రధారి సత్యరాజ్ మరో ప్రధాన పాత్రలో చేస్తున్నాడు. వీరిద్దరూ కాకుండా.. ఈ మూవీలో ఇంకో ప్రధానమైన రోల్ ఉండనుంది. అయితే.. ఇది పూర్తి స్థాయి పాత్ర కాదు. అలాగని గెస్ట్ రోల్ అనేందుకు కూడా లేదు. సినిమాకు కీలకంగా నిలిచే.. సుదీర్ఘమైన అతిథి పాత్ర అంటున్నారు. ఆ పాత్ర కోసం ఇప్పటికే రానాను పైనలైజ్ చేసేయగా.. దగ్గుబాటి హీరో నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.

1945చిత్రంలో రెండో ప్రపంచ యుద్ధం చివరి కాలం నాటి పరిస్థితులను కళ్లకు కట్టేలా చూపించబోతున్నారని తెలుస్తోంది. సత్యశివ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో.. దగ్గుబాటి రానా చేయనున్న రోల్.. అతని కెరీర్ లోనే స్పెషల్ కానుందట. ఈ పాత్రకు షూటింగ్ పూర్తి చేయగానే.. తేజ డైరెక్షన్ లో చేసే సినిమాను మొదలు పెడతాడట రానా.

,  ,  ,  ,  ,  ,