Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Jun-2017 14:19:02
facebook Twitter Googleplus
Photo

బాలీవుడ్ మూవీస్ పాటు.. భోజ్ పురి సినిమాలు చేసే కేరక్టర్ ఆర్టిస్ట్ రవి కిషన్ ను తెలుగు సినిమాకు విలన్ గా పరిచయం చేశాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. అల్లు అర్జున్ మూవీ రేసుగుర్రంలో నెగిటివ్ కేరక్టర్ లో మెప్పించిన ఇతనికి ఇప్పుడు టాలీవుడ్ లో తెగ ఆఫర్స్ వచ్చేస్తున్నాయి.

నితిన్ సినిమా లై షూటింగ్ ను యూఎస్ లో పూర్తి చేసుకుని ఇండియాకి తిరిగి వచ్చాడు రవికిషన్. ఒక సినిమా కోసం ఇంత సుదీర్ఘంగా పని చేయడం నాకు ఇదే మొదటిసారి. ఈ మూవీలో నేను ఓ పోలీస్ పాత్రలో నటిస్తుండగా.. ఇది పాజిటివ్ కేరక్టర్. త్వరలో కళ్యాణ్ రామ్ మూవీ ఎంఎల్ ఏలో కూడా నటిస్తున్నాను. ఇందులో మళ్లీ విలన్ అవతారంలో కనిపిస్తా అని చెబుతున్నాడు రవి కిషన్. ఇతడిని తెలుగులోకి తీసుకొచ్చిన సురేందర్ రెడ్డి.. మరోసారి బంపర్ ఆఫర్ ఇచ్చేశాడు. ఈసారి ఏకంగా మెగాస్టార్ చిరంజీవి మూవీలో చేసే అవకాశం రవికిషన్ కు వచ్చేసింది.

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ తెరకెక్కనున్న సినిమాలోనూ కీలకపాత్రలో కనిపించనున్నాడు రవికిషన్. మెగాస్టార్ చిరంజీవిగారితో వర్క్ చేసేందుకు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా. తెలుగు సినీ పరిశ్రమ నన్ను ఎంతో ఆదరిస్తోంది. ప్రేక్షకులు కూడా నన్ను బాగా రిసీవ్ చేసుకుంటున్నారు.

,  ,  ,  ,  ,