Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Jun-2016 11:04:57
facebook Twitter Googleplus
Photo

పాత తరం నటుల్లో.. చాలామంది తాము సంపాదించినదంతా.. తాగి తందనాలు ఆడ్డానికే తగలెట్టేశారు. కేవలం ఎన్టీఆర్.. ఏఎన్నార్.. శోభన్ బాబు మాత్రమే లక్షల రూపాయలను కూడబెట్టి.. వాటితో రియల్ ఎస్టేట్.. మార్కెట్స్ వగైరా వాటిపై ఇన్వెస్టమెంట్ పెడితే.. ఇప్పుడు అవి కోట్లు అయ్యి కూర్చున్నాయి. ఇక నవతరంలో చిరంజీవి ఒక్కరే అలా ప్రాపర్ గా ఇన్వెస్టు చేసి.. కాస్త గట్టిగా వెనుకేశారు. అయితే ఇప్పుడు వీరి రూటునే ఎంచుకున్నాడు హీరో రవితేజ కూడా.

అవును.. మనోడు ప్రస్తుతం తాను సంపాదించే రెమ్యూనరేషన్ అంతా రియల్ ఎస్టేట్ లో హ్యూజ్ గా ఇన్వెస్టు చేస్తున్నాడట. అంతే కాకుండా.. ఇతరత్రా పెద్ద బిజినెస్సుల్లో కూడా సైలెంట్ పార్టనర్ గా ఆల్రెడీ చాలా పెట్టుబడులు పెట్టాడట. ఈ మధ్యన లక్ష్మీ మంచు మొగుడు యాండీతో కలసి.. మనోడు ఇంకో బిజినెస్ లో కూడా డబ్బులు పెట్టాడని ఒక టాక్ వినిపిస్తోంది.

మొత్తానికి ప్రతీ సినిమాకీ ఇంతని ఖచ్చితంగా వసూలు చేసే మాస్ రాజా.. ఆ డబ్బులను ఏదో ఏదో అలా లగ్జరీల మీద ఖర్చు పెట్టేయకుండా.. చాలా జాగ్రత్తగా ఇన్వెస్టు చేసుకుంటూ పోవడం అనేది మంచిదే. ఇతర హీరోలు కూడా మనోడిని చూసి నేర్చుకుంటే బెటర్. ఎందుకంటే కెరియర్ లో డౌన్ ఫాల్ వచ్చినప్పుడు.. మనకి ఎవ్వరూ రూపాయి కూడా ఇవ్వరు.

,  ,  ,  ,