Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-May-2017 11:03:07
facebook Twitter Googleplus
Photo

తమిళ్ సినిమాలతో కెరీర్ మొదలుపెట్టి.. తెలుగులో మంచి క్రేజ్ సంపాదించడమే కాకుండా.. అనేక చిత్రాలలో నటించింది రెజీనా కసాండ్రా. కానీ స్టార్ స్టేటస్ కు దగ్గర కాలేకపోయిన ఈ భామ.. మళ్లీ ఇప్పుడు తమిళ్ పైనే ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం నక్షత్రం మూవీ తప్ప చేతిలో మరొక టాలీవుడ్ ఆఫర్ ఈ భామ చేతిలో లేదు.

ఓ కంటి ఆస్పత్రికి మాత్రం ప్రచారకర్తగా కొనసాగుతున్న రెజీనా.. రీసెంట్ గా హైద్రాబాద్ లో ఆ హాస్పిటల్ కొత్త బ్రాంచ్ ఓపెనింగ్ సందర్భంగా సందడి చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఈ ఐ హాస్పిటల్ ఓపెనింగ్ జరిగినా వాలిపోతూ ఉంటుంది. తాజాగా హైద్రాబాద్ లో జరిగిన లాంఛింగ్ ఈవెంట్ కు.. అందాలు ఒలికిస్తూ హాజరైంది ఈ ముద్దుగుమ్మ. బ్లాక్ టాప్ పై బ్లూ డ్రెస్ తో అమ్మడు ముద్దుగా సిద్ధమై వచ్చేసింది. పోనీ టైల్ మాదిరిగా తలకట్టు.. కొద్దికొద్దిగా క్లీవేజ్ అందాలను చూపిస్తూ.. రిబ్బన్ కటింగ్ కార్యక్రమాన్ని కంప్లీట్ చేసింది ఈ బ్యూటీ.

ఇక సినిమాల విషయానికి వస్తే కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందించిన నక్షత్రం కోసం ఎదురుచూస్తోంది రెజీనా కసాండ్రా. ఈ మూవీలో రెజీనా నటనను.. తన భార్య రమ్యకృష్ణ యూత్ ఫుల్ ఏజ్ నటనతో పోల్చాడు దర్శకుడు కృష్ణవంశీ. ఈ చిత్రం కోసం చాలానే డేట్స్ కేటాయించి కష్టపడింది రెజీనా.

,  ,  ,  ,  ,