Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

15-Feb-2017 12:20:27
facebook Twitter Googleplus
Photo

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా సెన్సేషన్ గానే ఉంటుంది. సినిమాలు తీయడం.. కామెంట్స్ పెట్టడం కూడా సెన్సేషనే. ప్రపంచంలో వర్మకు అక్కర్లేని టాపిక్ ఉండదేమో అనిపించక మానదు. ట్రంప్ నుంచి.. శశికళ వరకూ అన్ని టాపిక్స్ పై ట్వీట్లు పెడుతూ మహా బిజీగా ఉన్న రామ్ గోపాల్ వర్మ.. ఓ సెన్సేషనల్ ఐడియా వేశాడంటూ ఇప్పుడు బాలీవుడ్ లో టాక్ నడుస్తోంది.

ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ.. అమితాబ్ బచ్చన్ తో సర్కార్3 మూవీ తీస్తున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ లో ఈ చిత్రం రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేశాడు. అయితే.. ఈ సినిమా ద్వారా ముంబైలో తనకు ఉన్న కోట్ల కొద్దీ అప్పులను తీర్చేయబోతోన్నట్లు చెప్పుకుంటున్నారు. అసలు ఈ సినిమా నిర్మాణం కూడా.. వర్మకు అప్పులిచ్చిన వారందరూ కలిసి సిండికేట్ గా మారి తీసినదే అనే టాక్ వినిపిస్తోంది. టీజర్ రిలీజ్ అయ్యి.. సినిమా మార్కెటింగ్ మొదలయ్యాక.. అప్పుడు వర్మకు ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్ లోంచి తమ వాటాలు తీసుకుని.. ఏమైనా మిగిలితే అప్పుడు వర్మకు ఇస్తారట.

అసలు ఈ అప్పులు తీర్చడం కోసమే.. తెలుగులో కొన్ని రక్తచరిత్రనుంచి రకరకాల ప్రయోగాలు చేస్తున్నాడట వర్మ. అవేమీ సక్సెస్ కాకపోవడంతో.. వర్మతో ఫ్యాక్టరీ పేరుతో ఆఫీస్ ప్రారంభించే యోచన కూడా ఈ సిండికేట్ దే అని చెప్పుకుంటున్నారు. ఒకవేళ సర్కార్3 బ్లాక్ బస్టర్ అయితే.. వర్మ అప్పులన్నీ తీరిపోతాయ్. లేకపోతే మరో మూవీ చేయక తప్పదేమో అంటున్నారు. ఇందులో వాస్తవం ఎంతో చెప్పలేం కానీ.. ప్రస్తుతం ముంబైలో నడుస్తున్న హాట్ టాపిక్ ఇదే.

,  ,  ,  ,  ,  ,