Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Nov-2016 10:52:42
facebook Twitter Googleplus
Photo

లెజెండ్ సినిమాతో జగపతి బాబు కెరీర్నే మలుపు తిప్పాడు బోయపాటి శ్రీను. హీరోగా కెరీర్ పూర్తిగా దెబ్బతిన్న టైంలో ఈ సినిమాతో జగపతిబాబు రాతే మారిపోయింది. ఆ తర్వాత సరైనోడు సినిమాతో ఆది పినిశెట్టికి బ్రేక్ ఇచ్చాడు బోయపాటి. తెలుగులో నిలదొక్కుకోలేకపోతున్న ఆది.. ఈ సినిమాతో బిజీ అయిపోయాడు. ఇప్పుడు మరో తమిళ సీనియర్ నటుడిని తన కొత్త సినిమాలో ప్రత్యేక పాత్ర కోసం తీసుకున్నాడు బోయపాటి. ఆ నటుడు మరెవరో కాదు.. శరత్ కుమార్. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా బోయపాటి తెరకెక్కించనున్న కొత్త సినిమాలో శరత్ కుమార్ హీరో తండ్రిగా కీలకమైన పాత్ర చేస్తున్నాడు.

శరత్ కుమార్ పాత్ర చాలా బలంగా.. పవర్ ఫుల్ గా ఉంటుందని సమాచారం. ఇంతకుముందు అల్లు అర్జున్ ?బన్నీ? సినిమాలో శరత్ కుమార్ కీలక పాత్రతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత ?జీనియస్?.. ?చండీ? లాంటి చిన్న చిత్రాల్లో మాత్రమే కనిపించాడు. ఇప్పుడు మళ్లీ ఓ పెద్ద సినిమాలో కనిపించబోతున్నాడు. తమిళంలో శరత్ కుమార్ జోరు బాగా తగ్గిపోయింది. రాజకీయాల్లో బిజీ అయ్యాక ఆయనకు అవకాశాలు తగ్గిపోయాయి. ఐతే మొన్నటి ఎన్నికల్లో దెబ్బ తినడంతో ఇప్పుడు సినిమాలపై తిరిగి ఫోకస్ పెట్టాడు. ఈ నేపథ్యంలోనే బోయపాటి సినిమాను కూడా ఒప్పుకున్నాడు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ మీద మిర్యాల రవీందర్ ర్రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటిస్తోంది.

,  ,  ,  ,  ,  ,  ,