Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

31-May-2017 12:01:08
facebook Twitter Googleplus
Photo

ఎంఎస్ ధోని పర్సనల్ స్టోరీని నీరజ్ పాండే సినిమాగా తీసి మంచి విజయం సాదించారు. అలానే ఇప్పుడు కోట్లాది మంది క్రికెట్ అభిమానుల ఆరాధ్య దేవుడు సచిన్ కథతో బిలియన్ డ్రీమ్స్ అనే బయో పిక్ వచ్చింది. ఎంఎస్ ధోని పూర్తి హింది సినిమా కానీ.. సచిన్ మూడీ అలా కాదు. కొంత డ్రామా కొంత డాక్యుమెంటరీ రూపంలో రూపొందించిన సినిమా. అయనా సగటు బాలీవుడ్ సినిమా కన్నా చెప్పుకో తగ్గ కలెక్షన్లు రావడంతో అంతటా సంతోషం వ్యక్తపరుస్తున్నారు.

ఈ సినిమాకుగాను మాస్టర్ బ్లాస్టర్ సచిన్ కు ఒక టాప్ బాలీవుడ్ హీరోకు ముట్టినంత ముడుపులు కట్టారు మేకర్లు. సచిన్ ఈ సినిమాకు సుమారుగా 35 కోట్లు పారితోషకం తీసుకునట్లు టాక్. ఇందులో సచినే యాక్ట్ చేయడం వలన అంతటి పారితోషకం అడిగినట్లు చెబుతున్నారు. సచిన్ కూడా ఈ సినిమాను దేశం మొత్తం వెళ్ళి ప్రోమోట్ చేశాడు. ఇది డాక్యుమెంటరీ లాంటి సినిమా కావడంతో విడుదలకు ముందు అందరూ చాలా భయపడ్డారు. కానీ క్రికెట్ చరిస్మా సచిన్ క్రేజ్ ఆ భయాన్ని పూర్తిగా పోగొట్టింది. సోమవారం నాటికి బాక్స్ ఆఫీసు వద్ద 32 కోట్ల కలెక్షన్లు నమోదు చేసింది. ఈ తరహా సినిమాకు ఇంతటి కలెక్షన్లు రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

సచిన్ అన్న ఒక్క పేరు వలన వచ్చిన విజయానికి ప్రొడ్యూసర్స్ బాగా ఎక్సయిట్ అయ్యారులే. డిజిటల్ సాటిలైట్ రైట్స్ తో కూడా మంచి బిజినెస్ డీల్ చేసింది సినిమా. మొత్తానికి సచిన్ తీసుకున్న ముడుపులుకు కి న్యాయం జరిగినట్లే.

,  ,  ,  ,  ,