Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-May-2016 11:49:25
facebook Twitter Googleplus
Photo

మెగా హీరో సాయిధరమ్ తేజ్, నిర్మాత దిల్‍రాజు, దర్శకుడు అనిల్ రావిపూడిల కాంబినేషన్‌లో రూపొందుతోన్న ?సుప్రీమ్?, ఈ సమ్మర్‌కు రానున్న సినిమాల్లో తనదంటూ ఓ ప్రత్యేక క్రేజ్ తెచ్చుకున్న సినిమా. పోస్టర్స్, ఆడియో, ట్రైలర్స్‌తో ఇప్పటికే అంచనాల్ని పెంచేసిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఈ గురువారమే (మే 5న) ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఇక ఈ సినిమా రన్‌టైమ్ కూడా 142 నిమిషాలు మాత్రమే ఉండడం ఈ సినిమాకు ఓ ప్లస్ పాయింట్‌గా చెప్పుకోవచ్చు.
ఇప్పుడొస్తున్న మాస్ కమర్షియల్ సినిమాల ఫార్మాట్‌ను చూస్తే ఈ రన్‌టైమ్ సరిగ్గా సరిపోతుందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ?పటాస్‍?తో సూపర్ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి ఈ సినిమా కూడా తన మొదటి సినిమా తరహాలోనే మంచి విజయం సాధిస్తుందని భావిస్తున్నారు. వేసవి సెలవులను దృష్టిలో పెట్టుకొని సాధారణంగా సినిమాలు విడుదలయ్యే శుక్రవారం రోజున కాకుండా, ఓ రోజు ముందుగానే సినిమా విడుదలవుతోంది. సాయిధరమ్ తేజ్ సరసన రాశిఖన్నా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించారు.

,  ,  ,  ,  ,  ,