Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

17-Sep-2016 11:37:38
facebook Twitter Googleplus
Photo

చిన్న సినిమాల్లో పెళ్లిచూపులు అతి పెద్ద హిట్. బడ్జెట్.. ఇన్వెస్ట్ మెంట్ పరంగా చూస్తే కొన్ని ఏరియాల్లో పాతిక రెట్లు లాభాలను అందించి.. అందరినీ ఆశ్చర్యపరిచిన సినిమా ఇది. పెద్ద సినిమాలే మూడో వారం ఆడడం కష్టం అనుకునే యూఎస్ లో కూడా ఈ సినిమా 50డేస్ పూర్తి చేసుకుని.. అందరినీ స్టన్ అయ్యేలా చేసింది. అయితే.. ఈ మూవీ రైట్స్ దక్కించుకోవడాన్ని.. వారాహి చలనచిత్రం అధినేత మిస్ అయ్యాడనే మాట వినిపిస్తోంది.

పెళ్లిచూపులు నిర్మాణం పూర్తయ్యాక.. ఈ సినిమాని స్పెషల్ స్క్రీనింగ్స్ వేసి చూపించారు మేకర్స్. బయ్యర్ ని వెతుక్కోవడం కోసం బాగానే కష్టపడ్డారు కూడా. వీరు సంప్రదించిన వాళ్లలో సాయి కొర్రపాటి కూడా ఉండగా.. నిర్ణయం తీసుకునే బాధ్యతను శ్రీనివాస్ అవసరాలకు అప్పచెప్పాడట ఆయన. పెళ్లిచూపులు చిత్రాన్ని చూసిన అవసరాల.. కొనమంటూ సలహా ఇచ్చాడట కానీ.. సాయి కొర్రపాటి మాత్రం హక్కులు తీసుకోలేదు. ఇందుకు కారణం.. అప్పటికే చాలా మొత్తాన్ని మనమంతా.. జ్యో అచ్యుతానందపై ఇన్వెస్ట్ చేసేశాడు కొర్రపాటి.

అలా పెళ్లిచూపులు డిస్ట్రిబ్యూషన్ హక్కులు వారాహికి దక్కలేదు. ఒకవేళ కొనుగోలు చేసి ఉంటే మాత్రం.. సాయి కొర్రపాటి ఖాతాలో ఓ బ్లాక్ బస్టర్ పడి ఉండేది.

,  ,  ,  ,  ,  ,