Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-Jul-2017 14:00:38
facebook Twitter Googleplus
Photo

సౌత్ బ్యూటీ సమంత త్వరలో పెళ్లి పీటలు ఎక్కేయనున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరిలోనే వీరిద్దరి నిశ్చితార్ధం అంగరంగ వైభవంగా జరుగగా.. ఈ ఏడాది అక్టోబర్ లో పెళ్లి ముహూర్తం పెట్టేసుకున్నారు. అక్టోబరు 6న గోవాలో చైతు-శామ్ ల పెళ్లి వేడుకలు జరగనున్నాయి.

అయితే.. చెయ్-శామ్ లు పెళ్లి తర్వాత ఓ లాంగ్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నారని.. వీళ్ల హనీమూన్ టూర్ లో భాగంగా రెండు నెలలకు పైగా సమయాన్ని అమెరికాలో గడపనున్నారని.. దాదాపు 3 నెలల పాటు వీరిద్దరూ షూటింగులకు డుమ్మా కొట్టేస్తున్నారనే టాక్ వినిపించింది. కానీ.. వీటన్నిటినీ ఇప్పుడు సమంత సింగిల్ స్టేట్మెంట్ తో ఖండించి పారేసింది. 'అక్టోబర్ 6న గోవాలో మేమిద్దరం పెళ్లి చేసుకోనున్నమనే వరకే ఈ వార్తలలో నిజం ఉంది. డెస్టినేషన్ వెడ్డింగ్ అయినంత మాత్రాన.. హంగూ ఆర్భాటాలతో భారీగా ఖర్చు చేసి పెళ్లి చేసుకోవాలని మేము అనుకోవడం లేదు. ఒక సాధారణ పెళ్లి మాదిరిగానే.. ఫ్యామిలీ మెంబర్స్.. ఫ్రెండ్స్.. చుట్టాలు-పక్కాల మధ్య మా పెళ్లి జరుగుతుంది' అని చెప్పింది సమంత.

అలాగే తాము హనీమూన్ కోసం షూటింగ్ లు మానేసి 3 నెలలు చక్కర్లు కొడతామనే మాటలో కూడా వాస్తవం లేదని చెప్పిన సమంత.. తమ పెళ్లి జరిగిన మూడో రోజునే ఇద్దరం ఎవరి సినిమా షూటింగ్ లో వారు పాల్గొంటామని చెప్పి షాక్ ఇచ్చేసింది. సాధారణ వ్యక్తులే పెళ్లంటే 10 నుంచి నెల రోజుల పాటు పెళ్లి వేడుకల్లోనే ఉంటారు. అలాంటిది అంత పెద్ద సెలబ్రిటీలు అయి కూడా.. కనీసం మూడు నిద్దరలు పూర్తి కాకముందే షూటింగ్ కి వచ్చేస్తామని చెబుతున్నారంటే.. వీరిద్దరు ఎంతటి ప్రొఫెషనల్స్ అనే సంగతి అర్ధం చేసుకోవచ్చు.

,  ,  ,  ,