Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Jun-2016 16:50:40
facebook Twitter Googleplus
Photo

ఈ యాక్టర్ బాగ సేశారు.. వాళ్లు ఇరగదీశారు.. ఆ సోది అంతా చెప్పను'' అంటూ ''అ..ఆ'' సక్సెస్ మీట్ లో తన స్పీచ్ మొదలెట్టింది సమంత. అయితే ఈ అంశంపై ఇప్పుడు హీరో నితిన్ ఫ్యాన్స్ చాలా కోపంగా ఉన్నారని తెలుస్తోంది. ఒక ప్రక్కన సమంత ఎంచుకున్న పాత్ కరక్టే అయినప్పటికీ.. ఆమె కనీసం నితిన్ గురించి ఓ మాట చెప్పుంటే బాగుండేదని వీళ్ళ ఫీలింగ్. అసలు ఆమె 'సోది చెప్పను' అనే డైలాగ్ ఎందుకు కొట్టిందో చూద్దామా...

అందరూ ఎలాగో నటీనటులు గురించే మాట్లాడుతున్నారు కాబట్టి.. తాను ఖచ్చితంగా టెక్నీషియన్ల గురించి ఎక్కువ మాట్లాడతానని చెప్పింది సమంత. అంతే కాదు.. చెప్పినట్లే ఒక చీఫ్ అసోసియేట్ డైరక్టర్.. అలాగే ఇతర టెక్నికల్ క్రూ గురించి మాట్లాడింది. మంచి విషయమే. ఎందుకంటే ఎవ్వరూ ఈ బ్యాగ్రౌండ్ టీమ్ గురించి పెద్దగా ప్రస్తావించరు కాబట్టి. ఇక అదే సమయంలో దర్శకుడు త్రివిక్రమ్ అసలు ఈ సినిమా ఎందుకు తీశాడు.. తను ఎలా ఈ సినిమాలో పనిచేసిందీ చెప్పుకొచ్చింది. నిజానికి సమంత చెప్పిన దానిలో తప్పు లేకపోయినా కూడా.. సోది చెప్పను అంటూ కనీసం హీరో గురించి కూడా చెప్పకపోతే.. 'అంటే హీరో గురించి చెప్పడం సోది అవుతుందా?' అంటూ నెగటివ్ గా తీసుకున్నారు కొందరు.

వాస్తవానికి సమంత మీనింగ్ అది కాదులేండి. ఎలాగో త్రివిక్రమ్ నుండి శ్రీనివాస్ రెడ్డి వరకు అందరూ నితిన్ యాక్టింగ్ గురించే చెబుతున్నారు. పోసాని నుండి రావు రమేష్ వరకు మనోడ్ని పొగిడారు. అలాగే అందరూ అందరినీ పొగుడుతున్నారు. సో.. సమంత ఒక్కత్తే తెర వెనుక పనిచేసిన వారికి గుర్తింపు తెచ్చిపెడదామని ఆశ పడింది. తప్పులేదులే మాష్టారూ!!

,  ,  ,  ,  ,  ,  ,  ,  ,