Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-May-2016 15:17:29
facebook Twitter Googleplus
Photo

సూపర్ స్టార్ మహేష్ హీరోగా నటించిన ?బ్రహ్మోత్సవం? సినిమా మరో వారం రోజుల్లో థియేటర్లలో సందడి చేయనున్న విషయం తెలిసిందే. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ సరసన సమంత, కాజల్, ప్రణీత ముగ్గురు హీరోయిన్లు నటించారు. ఇక ఈ ఉదయం సినిమా విశేషాల గురించి తెలుపుతూ సమంత మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..
ప్రశ్న) వరుసగా మీ సినిమాలన్నీ సూపర్ హిట్ అయిపోతున్నాయి. ఈ సక్సెస్‌ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు?
స) నా సినిమాలన్నీ ఇలా వరుసగా విజయం సాధించడం సంతోషంగా ఉంది. అయితే దాన్ని నేను ఏమాత్రం తలకెక్కించుకోవట్లేదు. నటి శరణ్య మేడమ్ ఎప్పుడూ, ?ప్రతి రోజునీ మొదటిరోజుగా, ప్రతి సినిమానూ మొదటి సినిమాగా ఆలోచించుకొని పనిచేస్తూ పోవాల?ని అంటూంటారు. నేను అదే సూత్రాన్ని ఫాలో అవుతున్నా. కాబట్టి ఎంతవరకు ఎంజాయ్ చేయాలో అంతవరకే సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నా.
ప్రశ్న) ఇప్పుడు ?బ్రహ్మోత్సవం? సినిమా కోసం ఎలా ఎదురుచూస్తున్నారు?
స)?బ్రహ్మోత్సవం? కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో, నేనూ అంతే ఎదురుచూస్తున్నా. ఇదో ఉత్సవం లాంటి సినిమా. ఇలాంటి సినిమా తీయాలన్న ఆలోచన శ్రీకాంత్ అడ్డాల గారికి రావడం, మహేష్ గారు దానికి అన్నీ ముందుండి చేయడం, వారిద్దరినీ అభినందించాల్సిందే. ఈ సినిమాలో అద్భుతమైన భావోద్వేగాలు, కుటుంబ బంధాలు ఉంటాయి. ఇలాంటి నేపథ్యంలో నడిచే కథలో నేనూ ఓ భాగమవ్వడం గర్వంగా భావిస్తున్నా.
ప్రశ్న) మహేష్‌తో ఇప్పటికే రెండు సినిమాలు చేశారు. ఈ సినిమాతో మళ్ళీ ఆయనతో కలిసి నటించడం ఎలా అనిపించింది?
స)మహేష్ లాంటి స్టార్ హీరోలతో మళ్ళీ మళ్ళీ కలిసి నటించే అవకాశం రావడం నా అదృష్టం. మహేష్ చాలా సపోర్టివ్. ఆయన ఈ సినిమాలో మునుపటి కంటే యంగ్‍గా కనిపిస్తున్నారు. ఈ సినిమాలో మా ఇద్దరి జర్నీ కూడా చాలా బాగుంటుంది. సెకండాఫ్‌లో మా ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు చాలా రిఫ్రెషింగ్‌గా ఉంటాయి.
ప్రశ్న) ఈ సినిమాలో మీ రోల్ ఏంటి?
స) ఈ సినిమాలో నేను ఓ తెలివైన, సాంప్రదాయబద్ధమైన అమ్మాయిగా కనిపిస్తా. ఉన్నతంగా ఆలోచించే మనస్థత్వమున్న అమ్మాయి పాత్రను డిజైన్ చేసిన విధానం, ఆ పాత్ర నేపథ్యంలో నడిచే ప్రయాణం నాకు చాలా బాగా నచ్చాయి. రేపు సినిమా చూశాక, మీకూ నా రోల్ బాగా నచ్చుతుందన్న నమ్మకం ఉంది.
ప్రశ్న) కాజల్, ప్రణీత.. ఇలా ఇతర హీరోయిన్లతో స్క్రీన్ షేర్ చేస్కోవడంలో ఇబ్బంది ఫీలయ్యారా?
స) అలాంటిదేమీ లేదు. బ్రహ్మోత్సవం అనేది ఓ పెద్ద కథ. ఇలాంటి కథలో మేమంతా పాత్రలమే! కథే ఈ సినిమాకు స్టార్. ప్రతి పాత్రకూ ఓ ప్రాధ్యాన్యత ఉన్నప్పుడు ఎక్కడా, ఎవరితోనూ ఇబ్బంది అనేది ఉండదు. చెప్పాలంటే, ఈ సినిమాలో నాకు బాలా త్రిపురమణి అనే పాటంటే పిచ్చి ఇష్టం. ఆ పాట విజువల్స్ కూడా చూశా. అది నా పాట కాదని పొగడకుండా ఉండడం లేదు కదా! (నవ్వుతూ..)
ప్రశ్న) శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మళ్ళీ నటించడం గురించి చెప్పండి?
స)మనిషి ఆలోచన, భావోద్వేగాలను సరిగ్గా పట్టుకోవడంలో ఆయన మాస్టర్ ఏమో అనిపిస్తూంటుంది. ఈ సినిమా రేవతి గారికి, నాకు మధ్య ఒక సన్నివేశం ఉంటుంది. నేను నటించాల్సిన అవసరం లేకుండా, ఆ సన్నివేశమే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. ఈ సినిమాలో అలాంటి సన్నివేశాలు చాలా ఉంటాయి. శ్రీకాంత్ అడ్డాల బ్రాండ్ మార్క్ సినిమా బ్రహ్మోత్సవం అని కచ్చితంగా చెప్పగలను.
ప్రశ్న) చివరగా, ఇంత పెద్ద బడ్జెట్ సినిమాలో, ఇంతమంది స్టార్స్‌తో కలిసి నటించడం ఎలా అనిపించింది?
స) ఈ సినిమాలో నాటితరం స్టార్స్, నేటితరం స్టార్స్.. ఇలా అందరినీ కలిపి చూస్తే, ఇదో పెద్ద మల్టీస్టారర్. ఇలాంటి సినిమాల్లో నటించేప్పుడు నేర్చుకోవడానికి చాలా ఉంటుంది. అక్కణ్ణుంచి నటన పరంగానూ మనల్ని మనం మెరుగుపరుచుకోవచ్చు. ఆ విధంగా చూసినా బ్రహ్మోత్సవం నాకు స్పెషల్ సినిమాయే!

,  ,  ,