Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

05-Jul-2017 15:53:23
facebook Twitter Googleplus
Photo

ఒక ట్రయిలర్ చూడగానే ఇంకో సినిమా పోలికలు కాస్త కనిపిస్తే సినిమా విడుదల కాకముందే కాపీ ముద్ర పడిపోతోంది. సోషల్ మీడియా పుణ్యమా అని వెంటనే వైరల్ కూడా అయిపోతోంది. ఒకోసారి ఈ వ్యవహారం మరింత ముదిరి కోర్టు మెట్లక్కేవరకు వస్తోంది. ఈ మధ్య బాలీవుడ్ లో రిలీజైన రాబ్తా సినిమా విషయంలో ఇలాంటి హడావుడే కనిపించింది. ఈ సినిమా మగధీరకు కాపీ అంటూ విపరీతమైన ప్రచారం జరిగింది. దీనిపై మగధీర నిర్మాత అల్లు అరవింద్ కోర్టుకు కూడా వెళ్లారు. చివరకు ఈ వ్యవహారం ఎలాగో సద్దుమణిగింది.

తాజాగా నాని -నివేదా థామస్ హీరో హీరోయిన్లుగా వస్తున్న నిన్ను కోరి సినిమా విషయంలోనూ కాపీ అనే ప్రచారం జరుగుతోంది. అప్పుడెప్పుడో సంజయ్ లీలా భన్సాలీ హిందీలో తీసిన ‘హమ్ దిల్ దే చుకే సనమ్’ ఈ మూవీ కాపీ అంటూ ట్రయిలర్ చూస్తుండగానే కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. మీడియాలో కూడా దీనికి సంబంధించి వార్తలు రావడంతో డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ రియాక్డ్ అయ్యారు. నిన్ను కోరి చిత్ర నిర్మాతల్లో ఒకరైన కోన వెంకట్ ను దీని గురించి ఆరా తీశారట. దీంతో కోన వెంకట్ ఎందుకైనా మంచిదని సినిమా కథ మొత్తం చెప్పగా అంతా విని సంజయ్ లీలా భన్సాలీ బాగుందని అన్నారట.

హమ్ దిల్ దే చుకే సనమ్ సినిమాకు నిన్ను కోరి సినిమాకు ఎలాంటి సంబంధం లేదని హీరో నాని ఆల్రెడీ చెబుతున్నాడులే. రెండు సినిమాలు ట్రయాంగిల్ లవ్ స్టోరీలు కావడంతో అనసరమైన పోలికలు తెస్తున్నారని కొట్టిపారేశాడు.

,  ,  ,  ,  ,