Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

31-May-2016 11:47:09
facebook Twitter Googleplus
Photo

నేను శైలజ సినిమాతో కొద్దికాలంగా ఎదురుచూస్తూ వస్తోన్న సూపర్ హిట్ కొట్టేసిన హీరో రామ్, కొద్ది గ్యాప్ తీస్కోని ఈ మధ్యే తన కొత్త సినిమాను మొదలుపెట్టిన విషయం తెలిసిందే. తనకు ?కందిరీగ? లాంటి హిట్ ఇచ్చిన దర్శకుడు సంతోష్ శ్రీనివాస్‍తో రామ్ చేస్తోన్న ఈ సినిమాను 14 రీల్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇక రామ్ సరసన రాశిఖన్నా హీరోయిన్‍గా నటించనున్న ఈ సినిమా జూన్ ౩న సెట్స్‌పైకి వెళ్ళనుంది. ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నింటినీ పక్కాగా పూర్తి చేసుకొని సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్ళేలా టీమ్ ప్లాన్ చేస్తోంది.
హైద్రాబాద్‌లో ఫస్ట్ షెడ్యూల్ 12 రోజుల పాటు జరగనుంది. ఇక ఆ తర్వాత వైజాగ్‌లో మరో షెడ్యూల్ 18 రోజుల పాటు జరగనుందని టీమ్ తెలిపింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో సౌతిండియన్ స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సత్యరాజ్ ఓ కీలక పాత్రలో నటించనున్నారట. మిర్చి, బాహుబలి, బ్రహ్మోత్సవం, నేను శైలజ లాంటి సినిమాల్లో ప్రధాన పాత్రల్లో నటించి తెలుగులో స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిన సత్యరాజ్ పాత్ర సినిమాకు ఓ మంచి హైలైట్‌గా నిలుస్తుందని సమాచారం. ?కందిరీగ? తరహాలోనే ఓ యాక్షన్ ఎంటర్‍టైనర్‍గా తెరకెక్కనున్న ఈ సినిమాకు గిబ్రాన్ సంగీతం సమకూరుస్తున్నారు.

,  ,  ,  ,  ,  ,  ,  ,  ,