Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Jan-2015 10:56:47
facebook Twitter Googleplus
Photo

ప్రస్తుతం బాలకృష్ణ నటిస్తున్న 'లయన్' చిత్రం ఆయనకు సంఖ్యాపరంగా 98వ సినిమా. ఇది పూర్తి కావస్తుండడంతో తన 99వ చిత్రానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. ఇటీవల 'లౌక్యం' వంటి భారీ హిట్టు నిచ్చిన శ్రీవాస్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని చేస్తున్నారు. ఈ చిత్రానికి మోస్ట్ సక్సెస్ ఫుల్ రైటర్స్ అయిన కోన వెంకట్, గోపీ మోహన్ ద్వయం పనిచేస్తుండడం విశేషం. తాజాగా వీరు తమ స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసినట్టు సమాచారం. బాలయ్యకు వీరు తొలిసారిగా పని చేస్తున్నందున రెట్టించిన ఉత్సాహంతో, బాలయ్య స్టయిల్ కి తమ మార్క్ పంచ్ డైలాగులు జోడించి రాసినట్టు చెబుతున్నారు. 'లయన్' షూటింగ్ పూర్తి కాగానే ఇది సెట్స్ కి వెళుతుంది.

,  ,  ,  ,  ,