Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

24-Aug-2017 10:46:46
facebook Twitter Googleplus
Photo

మారిన కాలానికి తగ్గట్లు ప్రమోషన్ యాక్టివిటీస్ లో కొత్త మార్పులు వచ్చేస్తున్నాయి. బాలీవుడ్ సినిమా విడుదల సందర్భంగా టీవీల్లో పాపులర్ అయిన షోలలో పార్టిస్ పేట్ చేయటం.. అతిధులుగా ఎంట్రీ ఇచ్చి సినిమాను ప్రమోట్ చేస్తుంటారు. ఈ విషయంలో టాలీవుడ్ అంత యాక్టివ్ గా ఉండేది కాదు.

తాజాగా స్టార్ మాలో మొదలైన బిగ్ బాస్ షోకు తెలుగు రాష్ట్రాల్లో క్రేజ్ బాగా రావటంతో.. దాన్ని తమ సినిమా ప్రమోషన్లకు వాడుకుంటున్న వైనం రోజురోజుకి పెరుగుతోంది. ఇటీవల విడుదలైన సినిమా ప్రమోషన్లను బిగ్ బాస్ షోతో చేయటం.. దీంతో సదరు సినిమాల రీచ్ పెరగటంపై ఇప్పుడా షో మీద కొత్త సినిమాల ఫోకస్ పెరుగుతోంది.

ఈ మధ్యన విడుదలైన రానా.. నేనే రాజు.. నేనే మంత్రి మూవీ ప్రమోషన్ కు పంచకట్టుతో వెళ్లారు రానా. ఆ తర్వాత ఆనందోబ్రహ్మ మూవీ ప్రమోషన్లో భాగంగా నటి తాప్సీ కూడా బిగ్ బాస్ ఇంటికి వెళ్లి రావటం తెలిసిందే.

తాజాగా ఆ ఛాన్స్ అర్జున్ రెడ్డి చిత్ర హీరో విజయ్ దేవరకొండ బిగ్ బాస్ హౌస్ లో దర్శనం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం పలు రకాలుగా వివాదాస్పదమై.. మీడియాలో వార్తల రూపంలో పదే పదే రావటంతో పాటు ఈ మూవీ మీద ఇప్పటికే కొంత ఆసక్తిని క్రియేట్ చేయగలిగారు. బిగ్ బాస్ షోలో కనిపించటం ద్వారా సినిమాను మరింత పాపులర్ చేయాలన్న ఆలోచనలో ఉన్న అర్జున్ రెడ్డి చిత్ర టీం..తమ హీరోను బిగ్ బాస్ ఇంటికి పంపుతున్నట్లుగా తెలుస్తోంది.

,  ,  ,  ,  ,