Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

15-Jun-2016 11:46:36
facebook Twitter Googleplus
Photo

బాహుబలి ది కంక్లుజన్ సినిమాకు సంబంధించిన కీలక ఘట్టం క్లైమాక్స్ ఎపిసోడ్ ని 30కోట్ల బడ్జెట్ తో 90 రోజుల వ్యవధిలో తీయడానికి చిత్ర బృందం మొన్నశ్రీకారం చుట్టిన సంగతి తెలిసినదే. అయితే ఈ సీక్వెల్ కి గట్టి పోటీ ఇవ్వనున్న మరో సీక్వెల్ శంకర్ - రజినీల కలయికలో రానున్న రోబో తదుపరి వెర్షన్ 2.o(2 పాయింట్ జీరో కాదు.. 2 పాయింట్ 'ఓ' అన్నమాట).

ఈ 2.o సినిమా షూటింగ్ మొదలై 100రోజులు పూర్తయిన సందర్భంగా శంకర్ వర్కింగ్ స్టిల్ ఒకటి రిలీజ్ చేసి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చాడు. క్లైమాక్స్ తో పాటూ సినిమాలో వున్న భారీ యాక్షన్ సన్నివేశాలు పూర్తయినట్టు తెలిపాడు. 50% లోడింగ్ అని అంటే దాదాపు సగం సినిమా పూర్తయిందని హింట్ ఇచ్చాడు.

సౌత్ లోనే బెస్ట్ డైరెక్టర్స్ గా కీర్తింపబడే వీరిద్దరూ ఒకేసమయంలో సీక్వెల్స్ మీద వర్క్ చెయ్యడం - రెండూ భారీ బడ్జెట్ చిత్రాలుకావడం - గ్రాఫిక్స్ కి ప్రాధాన్యత వుండడంతో వీరిమధ్య పోటీ అత్యంత ఆసక్తికరంగా మారే అవకాశం వుంది.

,  ,  ,  ,  ,  ,  ,