Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Nov-2016 10:34:43
facebook Twitter Googleplus
Photo

దర్శకుడు శంకర్ ను చూసి ఎవరైనా కూడా ఒక్క విషయం నేర్చుకోవాలి. అదేంటంటే.. మనోడు తాను తీసే సినిమాలు ఏ రేంజువి అయినా కూడా.. తనకు గుర్తింపు సరిగ్గా ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా.. అవతలి వారి క్రియేటివ్ బ్రెయిన్ ను మాత్రం ఎప్రిషియేట్ చేస్తుంటాడు. అంతేకాదు.. ఇతరత్రా హిట్టు సినిమాలను కూడా పొగుడుతూ ఉంటాడు.

సాక్షాత్తూ రజనీకాంత్ అంతటివాడే.. మొన్న 2.0 ఫస్ట్ లుక్ లాంచ్ లో ఒక మాటన్నాడు. ''శంకర్ చాలా క్రియేటివ్ డైరక్టర్. అతను ఎప్పుడూ కూడా కాలం కంటే ముందే ఉండే ఆలోచనలతో అదరగొడతాడు. అందుకే 25 సంవత్సరాల నుండి ఫిలింస్ లో డైరక్టర్ గా రాణిస్తున్నాడు'' అని చెప్పాడు. అలాంటి శంకర్ చెప్పిన ఒక మాటేంటంటే.. ''నేను కూడా బాహుబలి 2 సినిమా కోసం ఎదురు చూస్తున్నాను. అలాగే తరువాత రోబో 2 వస్తుంది. అయితే ఇలాంటి సినిమాలు ప్రతి నెలా రావాలి. అప్పుడే మన ఇండియన్ సినిమా రేంజ్ ఎక్కడికో వెళుతుంది'' అంటూ తన భావాలను వ్యక్తపరిచాడు శంకర్.

శంకర్ ఆశ చాలా బాగుంది.. అలాగే అందరూ అలా ఆశపడటం కూడా మంచిదే. కాకపోతే అలాంటి ఆశలను నిజం చేసుకోవాలంటే మాత్రం.. మన దగ్గర ఇంకా క్వాలిటీ ఉన్న టెక్నీషియన్లు రావాలి. అప్పుడే కనీసం నెలకు ఒకటి కాకపోయినా ఏడాదికి ఒక్కటైనా బాహుబలి అండ్ రోబో వంటి సినిమాలు దిగుతాయి. అది సంగతి.

,  ,  ,  ,  ,