Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

26-May-2017 11:20:14
facebook Twitter Googleplus
Photo

యంగ్ హీరోస్ లో సూపర్ ఫామ్ లో ఉన్నాడు శర్వానంద్. వెరైటీ సినిమాలతో కెరీర్ స్టార్ట్ చేసి.. ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించడం మొదలుపెట్టి.. కమర్షియల్ మూవీస్ చేసేందుకు అభ్యంతరం లేదంటూ.. డిఫరెంట్ జోనర్స్ లో మెప్పించేస్తున్నాడు శర్వా. అలాగే సినిమాలు కంప్లీట్ చేయడంలో కూడా ఈ హీరో చూపించే జోరు మరెవరికీ సాధ్యం కాదేమో అనిపించక మానదు.

సంక్రాంతికి శతమానం భవతి మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్న శర్వానంద్.. ఆ వెంటనే రాధ చిత్రం మొదలుపెట్టాడు. మార్చ్ చివరకే ఈ మూవీ విడుదల చేయాలని అనుకున్నారు కానీ.. కొన్ని మార్పు చేర్పుల కోసం మే నెలకు వాయిదా వేశారు. రీసెంట్ గా వచ్చిన రాధ.. ఆశించిన స్థాయిలో లేకపోయినా.. వసూళ్ల విషయంలో పర్లేదనే అనిపించుకుంటోంది. ఇప్పుడు తన కొత్త సినిమాను కూడా మొదలుపెట్టేశాడు శర్వానంద్. మారుతి దర్శకత్వంలో శర్వా సినిమా గతంలోనే ఖాయం కాగా.. ఈ మూవీ టైటిల్ మహానుభావుడు.

ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ చేసేశాడట శర్వానంద్. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రంలో మెహ్రీన్ కౌర్ పీర్జాడా హీరోయిన్ గా నటించనుంది. ఏడాదికి నాలుగు రిలీజ్ లు చేయడం శర్వానంద్ టార్గెట్ అంటున్నారు సన్నిహితులు. అందుకే మారుతి మూవీని ఫుల్ పేస్ లో ఫినిష్ చేసేలా ప్లాన్ చేసుకున్నాడని తెలుస్తోంది.

,  ,  ,  ,  ,