Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

31-Oct-2016 11:02:12
facebook Twitter Googleplus
Photo

సౌత్ బ్యూటీ శృతి హాసన్ ఇప్పుడే కాదు.. ఎప్పుడూ ఫుల్లు జోష్ తో ఉంటుంది. తను చేసే పనిలోనే ఆనందం వెతుక్కోవడాన్ని తండ్రి నుంచి నేర్చుకున్న ఈ బ్యూటీ.. ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది. తన సంతోషాన్ని పదిమందికీ పంచడంలో కూడా హ్యాపీనెస్ ను వెతుక్కోవడం ఈ భామ స్పెషాలిటి.

ఇప్పుడు దివాళి పండుగ వచ్చింది. తమిళనాట అతి పెద్ద పండుగల్లో దీపావళికి ప్రముఖ స్థానం ఉంటుంది. ఈ పండుగను ఫ్యామిలీ మెంబర్స్ తోనే గడుపుతున్న శృతి తండ్రితో కలిసి దీవాళి చేసేసుకుంది. ఫ్లవర్ డిజైన్ తో వైట్ కలర్ లంగా జాకెట్ తో మెరిసిపోతున్న శృతి.. తండ్రితో కలిసి దిగిన ఫోటోను కూడా ఇన్ స్టాగ్రామ్ తో పంచుకుంది. రోడ్డుపై తను అవుట్ డోర్ లో కాకరపువ్వొత్తులు కాల్చడం.. ఇన్ డోర్ తండ్రి-కూతురు అనుబంధం.. రెండు ఫ్రేములను ఒకే ఫోటోలో చూపించి.. తను పండుగ ఎలా ఎంజాయ్ చేసిందో సింపుల్ గా చెప్పేసింది శృతి హాసన్.

విశ్వనటుడు కమల్ హాసన్ గత కొంత కాలంగా బెడ్ రెస్ట్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. తన ఆఫీస్ లోనే మెట్లపై నుంచి పడిపోయి కాలు ఫ్రాక్చర్ కావడంతో.. తనే డైరెక్ట్ చేస్తున్న మూవీ శభాష్ నాయుడుకు బ్రేక్ ఇచ్చి మరీ.. లాంగ్ బ్రేక్ తీసుకున్నారాయన. అందుకే ఈయన.. బయటకొచ్చి టపాసులు కాల్చలేదు. కానీ కూతురు క్రాకర్స్ కాలుస్తున్నఎంజాయ్మెంట్ ను చూసి కమల్ తెగ ఖుషీ అయిపోయారులే.

,  ,  ,  ,  ,