Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

24-Nov-2016 10:55:51
facebook Twitter Googleplus
Photo

అసలు అనుష్క సన్నబడిందా లేదా? ఇదే బాహుబలి సినిమా సీక్వెల్ కోసం ఎదురుచూసే వారందరూ వేసుకుంటున్న ప్రశ్న. ఆమె అభిమానులు కూడా ఈ విషయంలో కాస్త ఖంగారుపడుతున్నారు. అయితే అనుష్క ఎలా ఉన్నా కూడా.. ఆ సినిమాలో మాత్రం శృతి ఇచ్చే విందు రచ్చే. పదండి ఆ సంగతేంటో చూద్దాం.

వెయిట్ తగ్గి స్లిమ్ అయిన అనుష్క ముందుగా మనకు వెండితెర మీద దర్శనమిచ్చేది ''యముడు 3'' సినిమాలోనే. సింగం 3 గా రూపొందిన ఈ సినిమా.. డిసెంబర్ లో రిలీజవుతోంది. ఇకపోతే ఈ సినిమాలో అనుష్కతో సూర్య ఒక్కటంటే ఒక్క పాటనే చేశాడంట. కాని శృతి హాసన్ తో మాత్రం రెండు పాటలున్నాయి. ఈ పాటల తాలూకు స్టిల్స్ ను బట్టి చూస్తుంటే.. శృతి హాసన్ ఆరబోసిన అందాలను చూస్తుంటే కళ్లు జిగేల్ అంటున్నాయి. గతంలో సెవెన్త్ సెన్స్ వంటి కంటెంట్ ఉన్న సినిమాలో సూర్యతో నటించిన శృతి.. అప్పట్లో హిట్టు కొట్టలేకపోయింది. కాని ఇప్పుడు మాత్రం ఈ కాంబినేషన్లో ఒక బ్లాక్ బస్టర్ గ్యారంటీ అనిపిస్తోంది.

ఇకపోతే అనుష్క అందాల గురించి సినిమా రిలీజయ్యాకనే కామెంట్లు చేయగలుగుతాం. అది సంగతి.

,  ,  ,  ,  ,