Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Jul-2017 11:29:04
facebook Twitter Googleplus
Photo

సినీ తారలుఎంత జాగ్రత్తగా మాట్లాడినా.. మీడియాలోకి వచ్చేసరికి వాళ్ల మాటలు ట్విస్ట్ అయిపోతున్నాయి. జనాలకు మరో అర్థం వచ్చేలా ఆ వ్యాఖ్యలు ప్రెజెంట్ చేసేస్తున్నారు కొందరు. అవే ప్రచారంలోకి వెళ్లిపోయి సినీ తారలపై తప్పుడు అభిప్రాయం కలుగుతోంది. తన విషయంలోనూ అలాంటి ప్రచారమే జరిగిందంటోంది శ్రుతి హాసన్. పిల్లలు కనడానికి పెళ్లే అవసరమా అని శ్రుతి అందంటూ ఈ మధ్య ఓ వార్త హల్ చల్ చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఐతే నిజానికి తాను అలాంటి వ్యాఖ్యలు ఎప్పుడూ చేయలేదని శ్రుతి స్పష్టం చేసింది. తాను ఎప్పుడో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వేర్వేరు వ్యాఖ్యల్ని కలిపి ఓ స్టేట్మెంట్ తయారు చేసి జనాలకు తప్పుడు అభిప్రాయం కలిగించారని శ్రుతి ఆవేదన వ్యక్తం చేసింది.

శ్రుతి ఐదేల్ల కిందట ఓ ఇంటర్వ్యూ ఇచ్చిందట. అందులో పెళ్లి చేసుకుంటారా అని అడిగితే.. అందుకు ఇంకా చాలా టైం ఉందని.. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని అందట శ్రుతి. ఆ తర్వాత పిల్లల్ని కంటారా అని అడిగితే.. ఎందుకు కనను తప్పకుండా తల్లినవుతా అని చెప్పిందట శ్రుతి. ఐతే ఈ రెండు వ్యాఖ్యల్ని కలిపి.. శ్రుతి పెళ్లి చేసుకోదట. కానీ పిల్లల్ని కంటుందట అని స్టేట్మెంట్ తయారు చేసి ప్రచురించారని.. అది మరింతగా ట్విస్ట్ అయినా పిల్లల్ని కనడానికి పెళ్లే చేసుకోవాలా అనే తరహాలో తయారైందని శ్రుతి వివరించింది. తన గురించి ఇలా దుష్ప్రచారం చేయడం ఎంత వరకు సమంజసం అని ఆమె ప్రశ్నించింది.

,  ,  ,  ,