Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Jul-2017 10:44:28
facebook Twitter Googleplus
Photo

బాహుబలి 2 నిర్మాణం - విడుదల - విజయం - విరామం అన్నీ గొప్పగానే పూర్తయ్యాయి. ఇప్పుడు ఆ సినిమాలో పని చేసిన స్టార్లు కొత్త సినిమాలతో బిజీ అయ్యారు. బాహుబలి ప్రభాస్ కూడా ‘సాహో’ మొదలుపెట్టాడు. షూటింగ్ కూడా జరిగిపోతోంది. కానీ ఇప్పటికీ హీరోయిన్ ఎవరు అనేది ఫైనల్ కాలేదు. ఇంకా చూస్తున్నారు మాటలాడుతున్నారు వెతుకుతున్నారు. కాకపోతే ఇప్పుడు సాహో గతంలో బాహుబలి సినిమాలను ఆఫర్ చేసినా కూడా.. ఒకమ్మాయి వాటిని వదిలేసుకుంది. ఎవరో తెలుసా?

దిశా పటాని - శ్రద్ధా కపూర్ ను ముందు అనుకున్నారు కానీ వాళ్ళు అడిగే సొమ్ముకు ప్రొడ్యూసర్ చేతులు ఎత్తేశాడు. బాల్ గేమ్ ఇప్పుడు సెక్సిణి సోనమ్ కపూర్ దగ్గరకు వెళ్లింది. ఈ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ మూవీ సుమారుగా 150 కోట్లు పెట్టి నిర్మిస్తున్నారు. చిత్ర యూనిట్ సోనమ్ కు కథ చెప్పడానికి వెళ్లగా.. టూకీగా చెబితే బాగానే ఉంది నాకు కూడా చేయాలని ఉంది మొత్తం కథ ఒక సారి చెప్పండి అని చెప్పిందట. అంతే.. ఆ తరువాత మళ్ళీ మూసిన తలుపులు ఇంతవరకు తెరుచుకోలేదు. దానితో సాహో టీమ్ సోనమ్ పై నమ్మకం వదులుకున్నారు. సోనమ్ ఇంతకు ముందు కూడా ప్రభాస్ తో నటించాలని ఉందని చెప్పింది. బాహుబలిలో తమన్నా చేసిన అవంతిక పాత్ర ముందు సోనమ్ కపూర్ ను అడిగారు. ఆమె అప్పుడు ఎందుకు వద్దు అన్నదో మనకు తెలియదు. ఇప్పుడు కూడా నేషనల్ వైడ్ విడుదల అవుతున్న సాహో సినిమాకు ఎందుకు యెస్ చెప్పడానికి ఆలోచిస్తుందో ఆమెకే తెలియాలి. ఆమెను అడిగిన వాళ్ళకే తెలియాలి.

,  ,  ,  ,  ,