Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-Jul-2017 12:17:20
facebook Twitter Googleplus
Photo

ఈ ఏడాది రిలీజ్ కానున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన మూవీ స్పైడర్. మహేష్ బాబు హీరోగా నటించిన ఈ చిత్రంపై.. టాలీవుడ్ లో చాలానే అంచనాలు ఉన్నాయి. తమిళ్ లో కూడా హీరోగా మార్కెట్ పెంచుకునేందుకు మురుగదాస్ దర్శకత్వంలో బైలింగ్యువల్ గా ఈ ప్రాజెక్టు చేస్తున్నాడు మహేష్. ఇప్పుడీ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం ఓ స్టూడియోలో పాట చిత్రీకరణ జరుగుతుండగా.. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరిగిపోతున్నాయి.

బాహుబలి తర్వాత గ్రాఫిక్స్ వాడకంపై మన దగ్గర స్టాండర్డ్స్ పెరిగిన సంగతి తెలిసిందే. అందుకే స్పైడర్ లో కూడా విజువల్ ఎఫెక్ట్స్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టారట. ఒకవైపు వేగంగా పూర్తి చేయడానికి.. అనుకున్న తేదీ అంటే సెప్టెంబర్ 27 నాటికి విడుదల చేసేందుకు స్పైడర్ సిద్ధం చేయడానికి.. ఇప్పుడు అనేక దేశాల్లో స్పైడర్ కు సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ జరుగుతోంది. రష్యా.. ఇరాన్.. యూకే.. మరికొన్నిదేశాలతో పాటు ఇండియాలో కూడా VFX పనులు చకచకా సాగుతున్నాయి. హాలీవుడ్ స్టాండర్డ్స్ కు తగ్గట్లుగా స్పైడర్ లో గ్రాఫిక్స్ ఉంటాయని చెబుతున్నాడు నిర్మాత టాగూర్ మధు.

గతంలో మగధీరకు వర్క్ చేసిన ఇరాన్ టీం.. స్పైడర్ కు స్పెషల్ గా పని చేస్తోందని చెబుతుండడం విశేషం. ఇప్పటికే టాకీ పార్ట్ అంతా పూర్తి చేసుకున్న స్పైడర్ కు.. మరొక్క పాట మాత్రమే చిత్రీకరించాల్సి ఉంది.

,  ,  ,  ,  ,