Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

24-Nov-2016 10:31:03
facebook Twitter Googleplus
Photo

మీరు హిందీలో వచ్చిన హీరోయిన్ సినిమా చూశారా? ఆ సినిమాలో ఒక హీరోయిన్ తనకు క్రేజ్ పెరగాలని చెప్పి.. క్రికెట్ మ్యాచ్ లకు అటెండ్ అవ్వడం.. లేదంటే సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం. చూసేవారికి వీళ్ళేదో సేవ చేస్తున్నారు అనే కలరింగ్ లో ఉంటుంది కాని.. నిజానికి మాత్రం ఆ విధంగా వారు తమని తాము ఫ్రీగా ప్రమోషన్ చేసుకుంటున్నట్లే.

ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెబుతున్నారంటే.. నిజానికి మాజీ హీరోయిన్ శ్రీదేవి వేస్తున్న వేషాలు చూస్తుంటే.. ఏ రేంజులో తన కూతుళ్ళకు పబ్లిసిటీ కలిపిస్తోంది చూడండి. అమ్మడు ఆమెను ఎవరైనా ఇన్వయిట్ చేస్తే చాలు.. అక్కడికి అయితే పెద్దమ్మాయి జాన్వితో లేదంటే చిన్న అమ్మాయి ఖుషీ కపూర్ తో అక్కడికి వచ్చేస్తోంది. వాళ్ళేమో ఫుల్ గ్లామర్ లుక్కుతో దంచి కొట్టేస్తున్నారు. ఇదంతా కూడా వారికి ఫ్రీగా ప్రమోషన్ తెప్పించి.. వారిని పెద్ద పెద్ద సినిమాలతో డెబ్యూ చేయించాలనేది ఆమె ప్లాన్.

బాగానే ఉంది కాని.. ఇలా ఓవర్ హైప్ చేస్తే ఆటోమ్యాటిక్ గా తేడా కొట్టేస్తుంది అంతే. అనవసరంగా శ్రీ ఇచ్చే బిల్డప్స్ చూస్తే వారు కూడా ఒక సోనమ్ కపూర్ - శ్రద్దా కపూర్ తరహాలో డెబ్యూతో బొక్కబోర్లా కొడతారేమో అని విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. ఏమంటావ్ శ్రీ??

,  ,  ,  ,  ,