Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

31-May-2016 10:49:54
facebook Twitter Googleplus
Photo

శ్రీకాంత్ అడ్డాల. రెండు సినిమాలతో తనకంటూ క్రియేట్ చేసుకున్న ఆ సెన్సేషనల్ నేమ్ ను.. ఒకేఒక్క సినిమాతో పాడుచేసుకున్నాడు. నిజానికి ఏ ఫిలిం మేకర్ కైనా కూడా ఫ్లాపులూ హిట్లూ సహజమే కాని.. ఎందుకో ''బ్రహ్మోత్సవం'' విషయంలో మాత్రం కాస్త పెద్ద దెబ్బే పడింది. నిజానికి సినిమాలోని కొన్ని అంశాలు బాగానే ఉన్నా కూడా.. ఓవర్ హైప్ కారణంగా సినిమా డిజష్టర్ అయిపోయింది. దానితో ఆ మరక శ్రీకాంత్ పై ఘాటుగా పడింది.

ఇప్పటికే శ్రీకాంత్ అడ్డాలను ఏమీ అనొద్దు.. ఈ కథ ఎంపిక మరియు ఇతర విషయాలలో నేను కూడా చాలా తప్పులే చేశాను అంటూ మహేష్ తన సన్నిహితుల దగ్గర చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు శ్రీకాంత్ అడ్డాల మాత్రం.. అభిమానులకు సారీ చెబుదాం అని డిసైడ్ అయ్యాడట. అయితే అంతకంటే ముందే మహేష్ బాబను కలసి.. ఆయనకు ఒక సారీ చెప్పాలని ఫిక్సయ్యాడట. ఎందుకంటే మహేష్ లండన్ వెళ్లక ముందు అసలు శ్రీకాంత్ ను కలవలేదట. సినిమా రిలీజైన రోజునే మహేష్ వెళ్ళిపోయాడు. ఇక మహేష్ ల్యాండ్ అవ్వగానే ఒక్కాసారి కలసి సారీ చెప్పాలని యోచిస్తున్నాడు అడ్డాల.

ఇదేదో ఫార్మల్ గా చెప్పే సారీ కాదట.. అసలు సినిమా ఎందుకు ఫ్లాపైంది.. ఎక్కడ ఫెయిలైంది.. ఎలా అంచనాలు దెబ్బతిన్నాయి అనే విషయంపై సమగ్రంగా మహేష్ తో చర్చిస్తాడట మన దర్శకుడు. ఆ చర్చల తరువాత వారిద్దరూ ఫ్యూచర్ లో ఎటువంటి సినిమాను చేయాలి అనేది ఫిక్సవుతారట. సూపర్ కదూ.

,  ,  ,  ,  ,  ,  ,