Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Oct-2015 17:35:38
facebook Twitter Googleplus
Photo

నాన్-బాహుబలి రికార్డులన్నింటినీ కొల్లగొట్టేస్తుందన్న అంచనాలకు ఏమాత్రం తగ్గలేదు శ్రీమంతుడు. రెండు పెద్ద ఫ్లాపుల తర్వాత మహేష్ నటించిన సినిమా అయినప్పటికీ.. ఆ ప్రభావం ఏమీ లేకుండా బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టించిందీ సినిమా. విడుదలైన 50 రోజుల తర్వాత కూడా అక్కడక్కడా చెప్పుకోదగ్గ కలెక్షన్లు సాధిస్తూ సాగిపోయాడు ?శ్రీమంతుడు?. ఐతే ఎట్టకేలకు శ్రీమంతుడి పరుగు ఆగింది. 100 రోజుల మైలురాయిని అందుకోవడం కోసం కొన్ని చోట్ల ఆడుతున్నట్లుంది కానీ.. థియేట్రికల్ వసూళ్లైతే దాదాపుగా అయిపోయినట్లే భావించాలి. ఇంతకీ మొత్తంగా శ్రీమంతుడు సినిమా ఎంత వసూలు చేసిందో.. ఆ లెక్కలేంటో చూద్దాం పదండి.

ప్రపంచవ్యాప్తంగా రూ.144.55 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు సాధించింది ?శ్రీమంతుడు?. ఐతే షేర్ (థియేటర్ల రెంట్లు - ట్యాక్సులు - ఇతర ఖర్చులు మినహాయిస్తే వచ్చే నికర ఆదాయం) వంద కోట్లు దాటొచ్చన్న అంచనాలు నిజం కాలేదు. ఆ మార్కుకు చాలా దూరంలోనే నిలిచిపోయిందా సినిమా. ?శ్రీమంతుడు? వరల్డ్ వైడ్ షేర్ రూ.85.2 కోట్లు. ఐతే నెట్ (ట్యాక్స్ కాకుండా వచ్చిన ఆదాయం) వసూళ్లు మాత్రం రూ.108.26 కోట్లున్నాయి. నైజాం షేర్ రూ.22.34 కోట్లు కాగా.. సీడెడ్లో రూ.9.4 కోట్లు - ఆంధ్రాలో రూ.28.5 కోట్లు షేర్ వసూలైంది. మొత్తంగా ఏపీ - నైజాం కలిపితే రూ.60.17 కోట్ల షేర్ - రూ.90.75 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. యుఎస్ లో రూ.12.5 కోట్లు - కర్ణాటకలో రూ.7.07 కోట్లు - తమిళ నాట రూ.1.05 కోట్లు - ఇండియలోని మిగతా ప్రాంతాల్లో రూ.1.05 కోట్లు షేర్ కలెక్టయింది. తమిళ వెర్షన్ 1.07 కోట్లు తెచ్చింది. ఇలా మొత్తం కలిపితే షేర్ రూ.85.2 కోట్లుగా తేలింది. గ్రాస్ మాత్రం రూ.144.55 కోట్లకు చేరింది.

,  ,  ,