Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Jun-2015 11:22:30
facebook Twitter Googleplus
Photo

మహేష్ బాబు నటిస్తున్న 'శ్రీమంతుడు' సినిమా అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు వచ్చేలా లేదు. వాస్తవానికి ఈ చిత్రాన్ని జూలై 17న విడుదల చేయనున్నట్టు చిత్ర నిర్మాతలు ఇంతకు ముందు ప్రకటించారు. అయితే, ఈ రిలీజ్ వాయిదా పడుతున్నట్టు, ఆగస్టులో విడుదల చేయడానికి నిర్మాతలు నిర్ణయం తీసుకున్నట్టు తాజా సమాచారం. 'మిర్చి' ఫేం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతోంది. మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇందులో శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే!

,  ,  ,  ,  ,  ,  ,  ,  ,