Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Jan-2015 10:49:14
facebook Twitter Googleplus
Photo

'ఆగడు' సినిమా ఫ్లాపవడంతో తమ అభిమాన నటుడి కొత్త సినిమా ఎప్పుడొస్తుందా? అని మహేష్ బాబు అభిమానులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఆయన కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్న సంగతి విదితమే. ఈ సినిమా షూటింగ్ హైదరాబాదులో కొనసాగుతోంది. అయితే, భారీ కాంబినేషన్లు వుండడం వల్ల షూటింగ్ సమ్మర్ కి కానీ పూర్తి అయ్యేలా లేదు. అంటే, దీని విడుదల ఇక వేసవి సెలవుల్లోనే అని చెప్పుకోవచ్చు. రాజేంద్రప్రసాద్, జగపతిబాబు వంటి ప్రముఖ నటులతో బాటు బాలీవుడ్ నటి గ్రేసీ సింగ్ కూడా ఇందులో నటిస్తోంది. శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి 'శ్రీమంతుడు' అనే టైటిల్ అనుకుంటున్నారు.

,  ,  ,  ,  ,