Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

10-Apr-2017 14:06:04
facebook Twitter Googleplus
Photo

మహేష్ బాబు- శ్రీను వైట్ల.. కొన్నేళ్ల క్రితం ఈ కాంబినేషన్ అంటే సెన్సేషన్. ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన దూకుడు చిత్రం బ్లాక్ బస్టర్ కావడమే ఇందుకు కారణం. అయితే.. ఆ తర్వాత మహేష్ - వైట్ల చేసిన ఆగడు మాత్రం డిజాస్టర్ అయిపోయింది. ఆగడు కారణంగా.. ఇటు మహేష్.. అటు శ్రీను వైట్ల ఇద్దరికి బ్యాడ్ నేమ్ వచ్చింది.

ఆ తర్వాత మహేష్ శ్రీమంతుడుతో చాలా మెట్లు ఎక్కేస్తే.. బ్రూస్ లీతో నిరుత్సాహపరిచిన శ్రీను వైట్ల కిందకి దిగిపోయాడు. ఎలాగోలా మెగా హీరో వరుణ్ తేజ్ తో సినిమా అందుకుని మిస్టర్ ను పూర్తి చేశాడు వైట్ల. మరో నాలుగు రోజుల్లో ఈ చిత్రం రిలీజ్ కానుండడంతో.. బోలెడన్ని ప్రమోషనల్ ఇంటర్వ్యూలు ఇస్తున్న ఈ దర్శకుడు.. మహేష్ బాబుతో సినిమా ఇంకా లైన్ లోనే ఉందని చెప్పి ఆశ్చర్యపరిచాడు. కొన్ని వారాల క్రితం మహేష్ బాబును శ్రీను వైట్ల కలిసిన విషయం వాస్తవమే అయినా.. వీరి సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందా అన్నదే అసలు ప్రశ్న.

ప్రస్తుతం సూపర్ స్టార్ కి ఉన్న కమిట్మెంట్స్ పూర్తయ్యేందుకే కనీసం రెండేళ్లు పడుతుంది. ఆ తర్వాత కూడా చాలామంది పెద్ద డైరెక్టర్లే మహేష్ తో సినిమాకి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు

,  ,  ,  ,  ,