Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Nov-2015 17:37:41
facebook Twitter Googleplus
Photo

ఇప్పటికీ ఈ సంగతి ఆల్ మోస్ట్ కన్ఫమే అయినా.. అఫీసియల్ కన్ఫర్మేషన్ కోసం చూస్తున్నారు జనాలు. ఆ కన్ఫర్మేషనూ వచ్చేసింది. మలయాళ బ్లాక్ బస్టర్ ?ప్రేమమ్?కు రీమేక్ గా తెరకెక్కబోతున్న ?మజ్ను? సినిమాలో నాగచైతన్యను ప్రేమలో ముంచెత్తబోయేది శ్రుతి హాసనే అని తేలిపోయింది.

ఒక కుర్రాడి జీవితంలోని మూడు దశల్లో సాగే ప్రేమకథల నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లుంటారు. చైతూను టీనేజీలో లవ్ లోకి దింపే అమ్మాయిగా ?ప్రేమమ్?లో నటించిన అనుపమ పరమేశ్వరనే నటిస్తుండగా.. లెక్చరర్ పాత్రలో కథానాయకుడిని ప్రేమలో ముంచెత్తే బ్యూటీగా శ్రుతి హాసన్ కనిపించబోతోంది.

సినిమాలో లాంగెస్ట్ డ్యూరేషన్ లో సాగే లవ్ స్టోరీ ఇదే. తమిళంలో సాయి పల్లవి అనే అమ్మాయి ఈ పాత్రతో మలయాళ కుర్రకారును కట్టి పడేసింది. స్టూడెంట్-లెక్చరర్ మధ్య సాగే లవ్ స్టోరీ సినిమాకే హైలైట్ గా ఉంటుంది. ?కార్తికేయ? ఫేమ్ చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రాధాకృష్ణ సమర్పిస్తుండగా.. సూర్య నాగ వంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్సవం ఈ రోజే జరిగింది. డిసెంబర్ లో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టి వేసవికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు.

,  ,  ,  ,