Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

15-Apr-2017 10:21:21
facebook Twitter Googleplus
Photo

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్.. ఇప్పుడు తన అల్లుడు ధనుష్ ఒక మాంచి సినిమా తీశాడని చాలా ఆనందంగా ఉన్నాడు. ఈరోజే ధనుష్ డైరక్షన్లో రూపొందిన పవర్ పాండి సినిమా విడుదలైంది. ఈ సినిమాలో 60 ఏళ్ళ నాన్న పాత్ర చుట్టూ కథ అంతా తిరుగుతుంటుంది. ఈ సినిమాను ధనుష్ బాగా డైరక్ట్ చేశాడని.. మరో 10 ఏళ్ళ వరకు మరో సినిమా తీయకపోయినా పర్లేదని.. పొగిడేశారు రజినీ. ఈ సందర్భంగా ఆయన తన బెస్ట్ ఫ్రెండ్ మోహన్ బాబుకు ఒక సలహా కూడా ఇచ్చాడు.

నిజానికి పవర్ పాండీ సినిమాను తెలుగులో తను రీమేక్ చేస్తే బాగుంటుందని మోహన్ బాబుకు సూచించారట రజనీకాంత్. గతంలో పెదరాయుడు సినిమాను కూడా తెలుగులో తీయమని మోహన్ బాబుకు చెప్పింది ఆయనే. అయితే వయస్సు 60 టచ్ అవుతున్నా కూడా ఇంకా ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ చేస్తూ మామ మంచు అల్లుడు కంచు వంటి సినిమాలను తీస్తున్న మోహన్ బాబు.. ఇప్పుడు రజనీ మాట విని తన ఒరిజినల్ వయస్సుకు దగ్గరైన క్యారెక్టర్ చేస్తారా? చేస్తే మాత్రం బాగానే ఉంటుందని చెప్పొచ్చు.

మరి తన అల్లుడు ధనుష్ సినిమాను మోహన్ బాబు చేతిలో పెట్టడం పట్ల రజనీకాంత్ కూడా చాలా హ్యాపీగానే ఉన్నారట.

,  ,  ,  ,  ,