Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Oct-2016 11:13:55
facebook Twitter Googleplus
Photo

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామికి అర్జంటుగా ఓ సెల్ఫీ దిగాలని అనిపించింది. అది కూడా ఓ భక్తుడితో దిగాలన్నది ఆయన ఆలోచన. మరి దేవుడే ఓ సెల్ఫీ దిగాలంటే.. ఆ భక్తుడికి మహా భక్తి ఉండాలి కదా. అందుకోసమే తన భక్తుల్లో పరమ భక్తుడిని ఎంచుకున్నాడు. ఆ భక్తుడెవరో కాదు.. హథీరాం బాబాగా నటిస్తున్న అక్కినేని నాగార్జున. ఇప్పుడు ఆ దేవుడు ఎవరో కూడా అర్ధమైపోయింది కదా.

ఓం నమో వెంకటేశాయ మూవీలో వెంకటేశ్వర స్వామిగా నటిస్తున్న సౌరభ్ జైన్.. భక్తుడుగా నటిస్తున్న నాగార్జునతో కలిసి దిగిన ఫోటో ఇప్పుడు ట్రెండింగ్ అయిపోతోంది. అయితే.. యథా రాజా తథా ప్రజా అన్నట్లుగా.. దేవుడు టైప్ లోనే భక్తుడు కూడా మోడర్న్ గానే కనిపిస్తున్నాడు. దేవుడేమో నెత్తిన టోపీ.. కళ్లకు కూలింగ్ గ్లాసెస్ పెడితే.. భక్త నాగ్ మాత్రం జస్ట్ కళ్లద్దాలతో సరిపెట్టేశారు. వీళ్లిద్దరూ సినిమా గెటప్ లలో మేకప్ తో లేరు కానీ.. లేకపోతే ఈ ఫోటో అందరికీ లైఫ్ లాంగ్ మెమరబుల్ అయిపోయేదే.

రీసెంట్ గా మహాబలేశ్వరంలో షూటింగ్ పూర్తి చేసుకున్న ఓం నమో వెంకటేశాయ టీం.. ప్రస్తుతం హైద్రాబాద్ వచ్చేసింది. తర్వాతి షెడ్యూల్ ఇక్కడే స్టార్ట్ చేస్తారని అంటున్నారు. వచ్చే సంక్రాంతి నాటికి ఈ మూవీ రిలీజ్ చేసేయాలన్నది నాగ్ అండ్ టీం ఆలోచన.

,  ,  ,  ,  ,  ,