Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Jan-2017 10:52:11
facebook Twitter Googleplus
Photo

ఢిల్లీ సుందరి సురభి కోలీవుడ్ సినిమాలతో అరంగేట్రం చేసినా.. అనతి కాలంలోనే టాలీవుడ్ లో తేలింది. బీరువా అంటూ ఉషాకిరణ్ మూవీస్ హ్యాండ్ ఉన్న సినిమాతో ఇంట్రడ్యూస్ కావడంతో.. ఈమెపై ఇండస్ట్రీ కూడా బాగానే కాన్సంట్రేట్ చేసింది. మొదటి సినిమా ఆడకపోయినా.. డబ్బులు బాగానే వచ్చాయి. ఆ తర్వాత ఎక్స్ ప్రెస్ రాజా అంటూ శర్వానంద్ తో కలిసి మంచి హిట్ కొట్టినా ఇప్పటివరకూ ఈమె కెరీర్ కి బ్రేక్ రాలేదు.

మంచు మనోజ్ తో కలిసి ఎటాక్ మూవీ చేసింది కానీ.. ఆ మూవీ ఫ్లాప్ కావడంతో కెరీర్ కి ఉపయోగపడలేదు. గతేడాది నాని నటించిన జెంటిల్మన్ తో మంచి హిట్ సాధించినా.. ఆ క్రెడిట్ అంతా మరో హీరోయిన్ నివేదా థామస్ తీసుకెళ్లిపోవడంతో.. అమ్మడి పొజిషన్ అక్కడే ఉంది. ఇప్పుడు మరో మంచు హీరో విష్ణు ఈమెకు ఛాన్స్ ఇవ్వబోతున్నాడు. తాజాగా మంచు విష్ణు ఓ కొత్త సినిమాకు సైన్ చేశాడు. సుధీర్ పూదోట అనే నిర్మాత.. కార్తిక్ రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించనుండగా.. సురభిని ఈ మూవీలో హీరోయిన్ గా తీసుకోవవడం ఖాయం అయింది.

ఈ చిత్రంలో మియా జార్జ్ మరో హీరోయిన్ గా నటించనున్నా.. లీడ్ హీరోయిన్ రోల్ సురభికే ఇచ్చారట. జనవరి చివరి వారంలో షూటింగ్ ప్రారంభం కానుండగా.. మిగిలిన వివరాలతో పాటు మూవీపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ త్వరలోనే చేయనున్నారు.

,  ,  ,  ,  ,