Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-May-2016 15:59:14
facebook Twitter Googleplus
Photo

సూర్య హీరోగా నటించిన ప్రయోగాత్మక సినిమా ?24? మే 6న తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో భారీ ఎత్తున విడుదలకు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. ?మనం? తర్వాత చాలా గ్యాప్ తీస్కొని విలక్షణ దర్శకుడు విక్రమ్ కె కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా పోస్టర్స్, ట్రైలర్‌లతో ఇప్పటికే అంచనాలను పెంచేసింది. ఇక ఇప్పటికే ప్రమోషన్స్‌తో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయిన ఈ సినిమా నేటితో సెన్సార్‌తో సహా అన్ని టెక్నికల్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్‌కు పక్కాగా సిద్ధమైపోయింది.
సెన్సార్ బృందం చేత క్లీన్ ?యూ? సర్టిఫికెట్ తెచ్చుకున్న ఈ సినిమా 2 గంటల 44నిమిషాల నిడివితో మనల్ని అలరించేందుకు థియేటర్లకు వచ్చేస్తోంది. ఇప్పటితరం సినిమాలతో పోలిస్తే, ఈ రన్‌టైమ్ కాస్త ఎక్కువే అయినా సినిమా అసలు కథ పెద్దది కావడంతో ఈ రన్‌టైమ్ తప్పక అవసరమని టీమ్ చెబుతోంది. సూర్య తన సొంత బ్యానర్ 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిర్మించిన ఈ సినిమా టైమ్ అంశం చుట్టూ ఓ సరికొత్త కథా నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ నడుస్తుందని తెలుస్తోంది. సూర్య సరసన సమంత, నిత్యా మీనన్‌లు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు రెహమాన్ సంగీత దర్శకత్వం వహించారు. రెహమాన్ అందించిన సంగీతం కూడా ఇప్పటికే పాపులర్ అయిపోయింది. సూర్య ఈ సినిమా తెలుగు వర్షన్ కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

,  ,  ,  ,  ,  ,