Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Nov-2016 11:15:13
facebook Twitter Googleplus
Photo

ఏ సినిమాకైనా టైటిల్ ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేమీ ఉండదు. జనాలను ఇంప్రెస్ చేసే ఫస్ట్ పాయింట్ అది. సినిమాలకు మహారాజ పోషకులైన మాస్ జనాలు మొదటగా టైటిల్ కి ఇంప్రెస్ అయితేనే.. థియేటర్లకు వస్తారు. బాహుబలి అయినా.. శ్రీమంతుడు అన్నా.. సరైనోడు అని చెప్పినా.. జనతా గ్యారేజ్ అయినా.. టైటిల్ తో మెప్పించే బ్లాక్ బస్టర్ కొట్టగలిగాయి.

కానీ కోలీవుడ్ హీరో సూర్య ఎందుకో ఈ విషయంపై అంతగా పట్టు చూపిస్తున్నట్లు కనిపించదు. యముడు.. సింగం అంటూ మాస్ టైటిల్స్ రచ్చ రచ్చ చేసి హిట్ కొట్టేసి కూడా.. ఇప్పుడు అదే సినిమాకు మూడో భాగం తీస్తూ.. టైటిల్ మాత్రం S3 అని పెట్టుకున్నాడు. ఇంటర్నేషనల్ కాప్ కాబట్టి.. ఆ స్టైల్ లో టైటిల్ సెట్ చేసి ఉండచ్చు కానీ.. సింగం3 అంటే ఉన్న పవర్.. ఈ టైటిల్ లో లేదు. పైగా తాజాగా విడుదల చేసిన టీజర్ ఎవరినీ మెప్పించలేకపోయింది. కేవలం కెమేరా హంగులు.. ఊరకొట్టుడు ఫైట్స్ తప్ప వేరే ఏ అట్రాక్షన్ లేదు.

అయినా సూర్యకు ఈ నెంబర్లపై ఉన్న పిచ్చేంటో అర్ధం కాదు. ఓసారి 6 అని.. ఇంకోసారి 24 అని.. ఇప్పుడు 3 అని టైటిల్స్ లో పెట్టుకుంటున్నాడు. ఎంత మంచి సినిమా అయినా.. 24 జనాలకు రీచ్ కాకపోవడానికి కారణం టైటిల్ అనే విమర్శలున్నాయి. ఇప్పుడీ ఎస్3 ఏం చేస్తాడో? ఏమాత్రం మాస్ ఆడియన్స్ ఆకట్టుకుంటాడో? ఇక్కడో పాయింట్ ఉంది.. ఈ ఫైటింగుల హంగామా మూవీని ఆదరించాల్సింది వాళ్లే.

,  ,  ,  ,  ,  ,