Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

17-Nov-2015 18:05:12
facebook Twitter Googleplus
Photo

చేసిన సినిమా హిట్టయినా ఫ్లాపయినా స్వాతి మాత్రం మరో యేడాది తర్వాతే ప్రేక్షకులకు కనిపిస్తుంటుంది. తెలుగులో కొంతకాలంగా ఆమె ప్రయాణం ఇలాగే కొనసాగుతోంది. అయితే ఈసారి మాత్రం ఆ ఆనవాయితీని బ్రేక్ చేసేలా కనిపిస్తోంది. కథల గురించి మరీ ఎక్కువగా ఆలోచించకుండా కాస్త నచ్చిందంటే వెంటనే ఒప్పుకొని సినిమా చేసేయాలని డిసైడయ్యిందట. అలా ఆలోచించిందో లేదో వెంటనే ఆమెకి ఓ మంచి ఆఫర్ వచ్చినట్టు కూడా తెలిసింది. బెల్లంకొండ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ తో కలిసి నటించే అవకాశం స్వాతి చేజిక్కించుకున్నట్టు సమాచారం.

గుండెజారి గల్లంతయ్యిందే ఫేమ్ విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. త్వరలోనే ఆసినిమా పట్టాలెక్కబోతోంది. అందులో కథానాయికగా స్వాతిని ఎంపిక చేసుకొన్నట్టు తెలిసింది. ఇటీవల త్రిపురతో సందడి చేసింది స్వాతి. అందులో తనదైన స్టైల్ లో చాలా బాగా నటించింది.కానీ సినిమానే బాక్సాఫీసు దగ్గర నిలబడలేకపోయింది. ఇక ఈ దెబ్బతో స్వాతికి అవకాశాలు కష్టమే అనుకొన్నారంతా. కానీ ఫ్లాపులు సక్సెస్ లతో సంబంధం లేకుండా స్వాతికి అవకాశాలొస్తుంటాయి కాబట్టి ఆమెకి త్రిపురతో సంబంధం లేకుండా వెంటనే కొత్త ఆఫర్ వచ్చింది. మరి ఇందులో స్వాతి ఒక్కటేనా లేక మరో హీరోయిన్ కూడా ఉందా అన్నది తెలియాల్సి ఉంది.

,  ,  ,  ,