Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

25-Feb-2015 11:49:10
facebook Twitter Googleplus
Photo

ఇటీవల తెలుగులో వచ్చిన సూపర్ హిట్ చిత్రం 'టెంపర్' హిందీ రీమేక్ లో రణ్వీర్ సింగ్ హీరోగా నటిస్తాడు. తెలుగు వెర్షన్ నిర్మాత బండ్ల గణేష్ కు సన్నిహితుడైన సచిన్ జోషి ఈ సినిమా హిందీ రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నాడు. కొంత మంది హీరోలను సంప్రదించిన మీదట చివరికి రణ్వీర్ ను ఫైనల్ చేసుకున్నట్టు సమాచారం. అవినీతిపరుడైన ఓ పోలీసాఫీసర్ చివరికి నిజాయతీపరుడిగా ఎలా మారాడన్న అంశం చుట్టూ అల్లిన కథతో రూపొందిన 'టెంపర్' ఎన్టీఆర్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇప్పుడు హిందీ రీమేక్ కి కూడా పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించే అవకాశం వుంది.

,  ,  ,  ,  ,