Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Nov-2017 13:45:01
facebook Twitter Googleplus
Photo

150తో ఇండస్ట్రీలో తన రేంజ్ ఏంటో చాటి చెప్పారు మెగాస్టార్. 9 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చినా.. కమర్షియల్ మూవీతో టాలీవుడ్ రికార్డులను బద్దలు కొట్టేసి.. 100 కోట్లకు పైగా షేర్ తో తన సత్తా ఏంటో చెప్పిన చిరు.. తన 151వ చిత్రం విషయంలో మరింతగా కేర్ తీసుకోవడంలో ఆశ్చర్యం లేదు.

సై రా నరసింహారెడ్డి అంటూ.. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితంపై బయోపిక్ రూపొందించబోతున్నారు చిరంజీవి. దీనికి కూడా నిర్మాతగా రామ్ చరణ్ వ్యవహరించనుండగా.. ఆగస్టులో మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రంపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది. కానీ ఇప్పటివరకూ షూటింగ్ సంగతులేమీ తెలియకపోవడంతో.. మెగాస్టార్ మరుసటి మూవీ ఎప్పుడు ప్రారంభమవుతుందో అర్ధం కాక అభిమానులు డీలా పడిపోతున్నారు. ఇప్పుడు చిరు చిత్రం సైరా.. షూటింగ్ ప్రారంభానికి సంగతులపై లేటస్ట్ అప్ డేట్స్ వచ్చాయి. ప్రస్తుతం సై రా చిత్రానికి ప్రీ ప్రొడక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో ఉన్నాయని యూనిట్ అఫీషియల్ గా కొంతమంది సెలబ్రిటీలకు తెలిపింది.

రంగస్థలంకు వర్క్ చేస్తున్న సినిమాటోగ్రాఫర్ రత్నవేలు.. సైరాకు కూడా కెమేరా బాధ్యతలు నిర్వహించనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులకు సంబంధించిన పనులు..మీటింగ్స్ లో కూడా పాల్గొంటున్నాడట.

,  ,  ,  ,