Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-May-2017 15:35:01
facebook Twitter Googleplus
Photo

ఈనాటి దర్శకులు.. సంగీత దర్శకులు.. లిరిక్ రైటర్స్.. ఇలా అందరిపైనా కామెంట్లు చేశారు కీరవాణి. పాపం బాహుబలి 2 రిలీజ్ టైములో సినిమాకు తనవంతుగా ఏమన్నా ప్రమోషన్లు చేయాలని అనుకున్నారేమో తెలియదు కాని.. ఈయన ట్విట్టర్లో నానా హడావుడి చేసి హాట్ టాపిక్ అయిపోయారు. దానితో నిజంగానే మాంచి బజ్ వచ్చింది. అయితే తన దగ్గర పనిచేస్తున్న అసిస్టెంట్ ఒకరు మానేస్తే.. వెంటనే అతన్ని పెట్టేసుకోవాలని తమన్ ఎదురుచూస్తున్నాడని కూడా ఒక ట్వీటేశారు. అందులో ఆయన పాజిటివ్ గా చెప్పినా కూడా.. తమన్ ఏదో తప్పు చేస్తున్నాడన్నట్లు చూపించడంతో.. ఆల్ ఇండియా తమన్ ఫ్యాన్స్ గాట్టిగానే హర్టయ్యారు.

ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే.. బాహుబలి 2 సినిమా చూసిన చాలామంది ఈ సినిమాలో మ్యూజిక్ పెద్దగా కిక్ లేదని.. యుద్దం సీన్ లో రాక్ మ్యూజిక్ కొట్టడం ఏంది సామీ అంటూ కామెడీలు చేస్తున్న వేళ.. తమన్ మాత్రం కీరవాణిని ఆకాశానికి ఎత్తేశాడు. ''బాహుబలి వంటి అద్భుత సినిమాకు మ్యూజిక్ అందించడం అంటే మాటలు కాదు. ముఖ్యంగా 2వ భాగంలో ఆయన ఇంటర్వెల్ బ్యాగ్రౌండ్ స్కోర్ అదరగొట్టేశారు. అలాగే అమరేంద్ర బాహుబలి ఇంట్రొడక్షన్ పార్టులో కూడా బాగా స్కోర్ చేశారు. ఇతరత్రా కూడా చాలా అద్భుతంగా వచ్చాయి. ఇండియాకు ఎంతో గొప్ప పేరు తెస్తున్న కీరవాణి గారి దగ్గర నేను నా మ్యూజిక్ కెరియర్ మొదలెట్టినందుకు గర్వపడుతున్నాను'' అంటూ తమన్ చెప్పాడు.

,  ,  ,  ,  ,