Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

15-Sep-2017 11:25:51
facebook Twitter Googleplus
Photo

ఎదురు చూస్తున్న మిల్కీ బ్యూటి ఫస్ట్ లుక్ రానే వచ్చేసింది. ఇప్పటికే చాలా సినిమాల్లోతన అందాలను బీభత్సంగా ఆరబోసినా కూడా.. మళ్ళీ మళ్ళీ ఆమె నెమలి వలే నాట్యం వేస్తే ఎన్నిసార్లైనా చూడ్డానికి ఫిలిం లవ్వర్స్ రెడీగానే ఉంటారు. అందుకే ఇప్పుడు జై లవ కుశ సినిమాలో కూడా తమన్నా భాటియా ఒక ఐటెం సాంగ్ చేస్తోంది.

స్వింగు జరా.. అంటూ సాగే ఈ పాటను ఇప్పటివరకు రిలీజ్ చేయకుండా దాచి పెట్టారు మేకర్స్. ఎట్టకేలకు నిన్ననే ఆ పాట పేరును చెప్పారు. దేవిశ్రీప్రసాద్ కంపోజ్ చేసిన ఈ పాటలో తమన్నా ఎలాంటి హొయలు చిందిస్తోందో చెప్పడానికి ఇప్పుడు ఒక ఫోటో రిలీజ్ చేశారు. అదిగో చూస్తున్నారుగా.. ఎప్పటిలాగానే తన నడుమును స్వింగు చేస్తూ.. తన ఒంపుసొంపులను లయబద్దంగా ఆరేస్తూ.. తన మేని ఛాయతో పులకరింపజేస్తూ.. స్వింగు స్వింగంటోంది సెక్సీ భామ.

ఇకపోతే ఈ పాటకు సంబంధించిన ఒక టీజర్ ను ఈరోజు సాయంత్రం రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి జై లవ కుశ సినిమాలో రాశి ఖన్నా గ్లామర్.. నివేతా థామస్ హాట్నెస్ మాత్రమే ఉన్నాయని అనుకుంటే.. ఇప్పుడు జూ.ఎన్టీఆర్ కోసం మిల్కీ కూడా దిగేసింది.

,  ,  ,  ,