Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

20-Jan-2015 11:03:30
facebook Twitter Googleplus
Photo

ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త. తమ అభిమాన నటుడు నటిస్తున్న తాజా చిత్రం 'టెంపర్' ఆడియో వేడుకకు డేట్ ఫిక్స్ చేశారు. ఈ నెల 26న ఈ వేడుకను హైదరాబాదులో ఘనంగా నిర్వహించడానికి నిర్ణయించారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించారు. ఇక చిత్రాన్ని ఫిబ్రవరి 13న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు తాజా సమాచారం. వరుస ఫ్లాపుల్లో వున్న ఎన్టీఆర్ ఈ సినిమాపై చాలా నమ్మకం పెట్టుకున్నాడు. బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది.

,  ,  ,  ,  ,