Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-Mar-2016 14:09:20
facebook Twitter Googleplus
Photo

తమిళంలో ''మాన్ కరాటే''గా తెరకెక్కిన సినిమాను తెలుగులోకి నారా రోహిత్ ''తుంటరి'' పేరుతో రీమేక్ చేశారు. కెరీర్ ప్రారంభం నుంచి వైవిధ్య సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న రోహిత్.. తుంటరి పేరుతో మాస్ కమర్షియల్ సినిమాతో ముందుకొచ్చాడు. గుండెల్లో గోదారి, జోరు లాంటి సినిమాలతో ఆకట్టుకున్నా, సక్సెస్ సాధించలేకపోయిన దర్శకుడు కుమార్ నాగేంద్ర తుంటరితో హిట్ కొట్టాలనుకుంటున్నాడు. అయితే తుంటరిలో నారా రోహిత్ హీరోయిజం మిస్ అయ్యిందని టాక్ రావడంతో ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఏమేరకు ఆశిస్తుందో వేచి చూడాల్సిందే.

ఇక కథలోకి వెళితే..
ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేసే ఐదుగురు ఫ్రెండ్స్ (కిశోర్, ఆనంద్, సుదర్శన్, కల్కి, పూజిత) కలిసి అనంతగిరి అడవులకు పిక్నిక్ కోసం వెళ్తారు. అక్కడ ఓ సాధువును కలుస్తారు. ఆ సాధువును కలిసిన సందర్భంగా ఈ ఐదుగురికి భవిష్యత్తుకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం తెలియవస్తుంది. నాలుగు నెలల తరువాత జరగబోయే ఓ బాక్సింగ్ మ్యాచ్లో రాజు అనే వ్యక్తి గెలుస్తాడని.. అతనికి రూ.ఐదుకోట్లు లభించనున్నాయని చెప్తాడు. ఆ రాజు (నారా రోహిత్) బిఎస్ఎన్ఎల్లో పనిచేసే ఆనందరావు గారి అబ్బాయి అని ఆ ఐదుగురు స్నేహితులకు తెలియవస్తుంది. దీంతో బాక్సింగ్ విన్నర్‌గా నిలిచే ఆ వ్యక్తిని వెతికి పట్టుకుంటారు. రాజు చిన్నప్పటి నుంచి చదువు, పనిలేకుండా తిరుగుతుంటారు.

రాజు తండ్రి ఆనందరావు (కాశీ విశ్వనాథ్) బిఎస్ఎన్ఎల్ ఆఫీస్లో పని చేస్తుంటాడు. అలా రాజును పట్టుకుని నెల జీతమిస్తామని బాక్సింగ్ ప్రాక్టీస్ చేయమని.. అందుకు అయ్యే ఖర్చులన్నీ భర్తిస్తామంటారు. ఆ ఐదుగురు స్నేహితులతో రాజు ఒప్పందం కూడా కుదిరిపోతుంది. ఇంతలో సిరి (లతా హెగ్డే)తో ప్రేమలో పడతాడు రాజు. బాక్సింగ్ ప్రాక్టీస్ చేయకుండా సిరి వెంట పడుతూ ఆమె ప్రేమను గెలుచుకుంటాడు.

బాక్సింగ్ ప్రాక్టీస్ సమయంలో ఆ ఐదుగురు స్నేహితులకు ఓ షాక్ తగుల్తుంది. ఇప్పటికే చాలాసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఆ టాప్ బాక్సర్ పేరు కూడా రాజు (కబీర్ దుహన్ సింగ్) అని తేలడంతో పాటు అతడి తండ్రిపేరు కూడా ఆనందరావు అని తెలియవస్తుంది. అతను కూడా బిఎస్ఎన్ఎల్లోనే ఉద్యోగం చేస్తున్నాడని తెలుస్తుంది. దీంతో షాక్ తినే ఆ ఐదుగురు స్నేహితులు లోకల్ రాజు ఓడిపోతాడని, ఛాంపియన్ రాజే గెలుస్తాడనే అనుకుంటారు. అయితే చివరికి ఏ రాజు గెలుస్తాడు. స్వామీజీ ఇచ్చిన మాట ఏమవుతుంది. ఆ ఐదుగురు స్నేహితులకు ఐదు కోట్లు లభిస్తాయా.. రాజు సిరి ప్రేమను ఎలా పొందుతాడు అనేది తెలియాలంటే.. సినిమా చూడాల్సిందే.

నటీనటులు :
ఈ సినిమాలో నారా రోహిత్ హీరో జోష్ తగ్గింది. ఇప్పటివరకు డీసెంట్‌ పాత్రల్లో మెప్పించిన నారా రోహిత్ తొలిసారిగా లోకల్ రాజు పాత్రలో మాస్ క్యారెక్టర్ను ట్రై చేశాడు. ముఖ్యంగా కామెడీ టైమింగ్తో ఆకట్టుకున్న రోహిత్, తనకు బాగా పట్టున్న ఎమోషనల్ సీన్స్లోనూ మెప్పించాడు. కానీ బొద్దుగా కనిపించి.. రోహిత్ లుక్‌ను పాడు చేసుకున్నాడు. లవ్ సీన్స్‌లో ఇబ్బంది పెట్టాడు. బాక్సర్‌గా కాస్త సరిపోయాడు. హీరోయిన్, న్యూజిలాండ్ మిస్ న్యూజిలాండ్ లతా హెగ్డే పాత్రకు న్యాయం చేసింది. రాజును గెలిపించాలనుకునే ఐదుగురు ఫ్రెండ్స్‌గా వెన్నెల కిశోర్, ఆనంద్, సుదర్శన్, కల్కి, పూజితాలు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. కబీర్ దుహన్ సింగ్ విలన్ పాత్రకు సూపర్‌గా సూట్ అయ్యాడు. పాత్రకు న్యాయం చేశాడు. బాక్సర్ రోల్‌కు ఒదిగిపోయాడు. షకలక శంకర్ కామెడీ బాగుంది. బాక్సింగ్ రిఫరీగా ఆలీ కామెడీ పండింది.

దర్శకుడు కుమార్ నాగేంద్ర రీమేక్ తీరు మెచ్చుకోదగిందే. రోహిత్లోని కామెడీ యాంగిల్ను ఆడియన్స్కు పరిచయం చేయడంలో దర్శకుడు సఫలమయ్యాడు. సాయి కార్తీక్ సంగీతం బాగుంది. పాటలతో పర్వాలేదనిపించిన కార్తీక్ నేపథ్య సంగీతంతో ఆకట్టుకున్నాడు. ప్రతీసీన్ను తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్తో మరింత ఎలివేట్ చేశాడు. పలనీ కుమార్ సినిమాటోగ్రఫి, మధు ఎడిటింగ్ బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్ :
నారా రోహిత్ కామెడీ టైమింగ్
సంగీతం
స్టోరీ స్క్రీన్ ప్లే

మైనస్ పాయింట్స్ :
డైలాగ్స్
నారా రోహిత్ జోష్ తగ్గడం
రోహిత్ బొద్దుగా కనిపించడం..

రేటింగ్: 2.5/5

,  ,  ,  ,